Movie News

యానిమల్ చాలా వయొలెంట్ గా ఉన్నాడు

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ ఆగస్ట్ 11 విడుదల కావడం కన్ఫర్మని యూనిట్ నుంచి సమాచారం వస్తున్నా ఇంకా అనుమానాలైతే తొలగిపోలేదు. పోటీగా ఉన్న గదర్ 2 మీద మెల్లగా బజ్ పెరుగుతున్నా, హఠాత్తుగా ఓ మై గాడ్ 2 పోటీలోకి వచ్చినా అవేవీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా యానిమల్ ప్రీ లుక్ టీజర్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉండింది. రన్బీర్ కపూర్ ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడన్న విషయం మీద క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టే నిమిషంలోపే ఉన్న చిన్న వీడియోని వదిలారు

ఖరీదయిన సూట్లు వేసుకున్న గుంపు ఒకటి మొహానికి ఐరన్ మాస్కులు వేసుకుని దాడికి రాబోతుండగా రన్బీర్ గోడ మీద అద్దాల అరలో నుంచి చిన్న గొడ్డలి తీసి వాళ్ళను ఊచకోత చేయడం మొదలుపెట్టడం నుంచి ప్రాణ భయంతో వాళ్ళందరూ పారిపోయే దాకా వెంటాడే క్రమాన్ని ఇందులో చూపించారు. బ్యాక్ గ్రౌండ్  లో మంచి సాంప్రదాయ ఫాస్ట్ బీట్ పంజాబీ పాట వైరల్ అయ్యే రేంజ్ లో ఉంది. రన్బీర్ కపూర్ ని పూర్తిగా చూపించలేదు కానీ లీకైన స్టిల్స్ లో ఉన్నట్టే మాసిపోయిన గెడ్డంతో పాటు పంచెకట్టు లాంటి స్టైల్ లో సందీప్ వంగా ఏదో వెరైటీగా ట్రై చేయించాడు

గ్యాంగ్ స్టర్ డ్రామాతో యానిమల్ రూపొందినట్టు ఇప్పటికే టాక్ ఉంది. బాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్న స్టోరీ కూడా దాన్ని బలపరుస్తోంది. తండ్రిని చంపిన వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఒక ఫిజిక్స్ లెక్చరర్ హింసాత్మకంగా మారే క్రమాన్ని ఇందులో చూపిస్తారట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కబీర్ సింగ్ వల్ల సందీప్ వంగాకు నార్త్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆగస్ట్ 11న ఓ రేంజ్ లో అరాచకం చూపిస్తాడని ఫ్యాన్స్ బోలెడు నమ్మకంతో ఉన్నారు.


This post was last modified on June 11, 2023 4:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాస్య బ్రహ్మ… ఇన్‌స్టా ఆగమనం

తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ…

1 hour ago

ఢిల్లీ వీధుల్లో తెలుగు ‘ఆత్మ గౌరవం’

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల కోసం అటు అధికార…

1 hour ago

యుఎస్‌లో మన సినిమాల పరిస్థితేంటి?

యుఎస్‌లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో…

2 hours ago

కిర్లంపూడిలో టెన్షన్… ఏం జరిగింది?

కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో…

2 hours ago

వీడో రౌడీ హీరో!.. సినిమాను మించిన స్టోరీ వీడిది!

సినిమాలు… అది కూడా తెలుగు సినిమాల్లో దొంగలను హీరోలుగా చిత్రీకరిస్తూ చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. వాటిలోని మలుపులను మించిన…

3 hours ago

వైసీపీని వాయించేస్తున్నారు.. ఉక్కిరిబిక్కిరే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీని కూటమి పార్టీలు వాయించేస్తున్నాయి. అవ‌కాశం ఉన్న చోటే కాదు.. అవకాశం వెతికి మ‌రీ వైసీపీని…

3 hours ago