ఉరుముల శబ్దానికి ఆడే మెరుపులు ఆకాశం నుంచి నేలకి దిగివచ్చినట్టుగా అనిపించే 8 జంటలతో అపురూపమైన డాన్స్ షో అందిస్తోంది స్టార్ మా. షో పేరు “నీతోనే డాన్స్”.
మనం ఎంతో అభిమానించే సీరియల్స్ నుంచి కొందరు, ఎన్నో ఇతర షో ల నుంచి ఇంకొందరు “నీతోనే డాన్స్” వేదిక పైన సంచలనాలు చేయబోతున్నారు. ఒకరిని ఒకరు ఢీ కొట్టేందుకు, ఎవరి ప్రత్యేకతని, స్టయిల్ ని వారు నిరూపించుకునేందుకు ప్రతి ఒక్కరు అస్త్రశస్త్రాలతో సిద్ధపడుతున్నారు. “నీతోనే డాన్స్” కేవలం ఒక డాన్స్ షో కాదు.. ఒక సరికొత్త డాన్స్ ప్రపంచం. డాన్స్ లో ఎన్నో అద్భుతాలను, ఇంతకు ముందు చూడని ఎన్నో ఆశ్చర్యాలను ఆవిష్కరించబోతోంది. వేదిక పైకి వచ్చిన ప్రతి ఒక్కరిలో డాన్స్ పరంగా మరో కొత్త కోణాన్ని పరిచయం చేయబోతోంది.
జూన్ 11 సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ లాంచ్ తో “నీతోనే డాన్స్” షో ప్రారంభం కాబోతోంది. ఇక ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన అమరదీప్ – తేజస్విని, నిఖిల్ – కావ్య, శివ కుమార్ – ప్రియాంక, నటరాజ్ – నీతూ, సందీప్ – జ్యోతి రాజ్, యాదమ్మ రాజు – స్టెల్లా, సాగర్ – దీప, పవన్ – అంజలి ఈ “నీతోనే డాన్స్” షో ని వేరే స్థాయిలో నిలబెట్టేందుకు కఠోరమైన సాధన చేస్తున్నారు.
ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న “నీతోనే డాన్స్” ప్రోమోలు ఈ షో స్థాయికి సంబంధించిన అంచనాలను పెంచాయి. స్టార్ మా ఎంతో ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఈ షో – అద్భుతమైన డాన్స్ కి, ఆరోగ్యకరమైన పోటీకి ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతోంది.
“నీతోనే డాన్స్” ని ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/IpQo9QnSvlo
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates