కుర్ర హీరో నిఖిల్ స్పై ఈ నెల 29 విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ లో మార్పు ఉండొచ్చని ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని యూనిట్ వాటిని కొట్టిపారేసింది. అయితే చేతిలో పంతొమ్మిది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇప్పటి నుంచి హడావిడి చేస్తే అన్ని రాష్ట్రాలకు రీచ్ అవుతుంది. అలా కాకుండా సైలెంట్ గా ఉండటం వల్ల లాభం లేదు. అయితే స్పై టీమ్ చాలా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని ఇన్ సైడ్ టాక్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొదటిది ఆదిపురుష్. 16న రాబోతున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ కు ఎలాంటి స్పందన వస్తుందోనని దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ తో పాటు హిందుత్వ వాదులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బద్దలు కావడం ఖాయమే. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం కనీసం రెండు మూడు వారాల పాటు ఊచకోత ఉంటుంది. ఆ ఊపులో స్పైని వారం గ్యాప్ తో దించడం పెద్ద రిస్క్ అవుతుంది. కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ సలహా మేరకు హిందీ వెర్షన్ కు థియేటర్ల కొరత వచ్చే రిస్క్ ని దృష్టిలో ఉంచుకుని ఆగాలని నిర్ణయించుకున్నారట.
ఒకవేళ ఇక్కడ చెప్పింది జరిగితే వాయిదా తప్పకపోవచ్చు. అయితే ఇప్పుడే కన్ఫర్మ్ గా చెప్పలేం. ఒకవేళ 29 ఫిక్స్ అనుకున్నా ఆదిపురుష్ మేనియాలో ఇంకే సినిమా గురించి చెప్పినా జనాల బుర్రలోకి ఎక్కదు. అందుకే 17 దాకా వేచి చూడటం బెటర్. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం మీద రూపొందిన స్పైని దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో యాక్షన్ విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. తనకు మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని నిఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి పబ్లిసిటీ స్పీడ్ పెంచితేనే అభిమానులకు స్పై మీద ధీమా కలుగుతుంది
This post was last modified on June 11, 2023 8:33 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…