ఫిలిం సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సరదాగా వంట గదిలోకి వెళ్తుంటారు. తమకు నచ్చిన, వచ్చిన వంటకాలేవో చేస్తుంటారు. ఐతే మేల్ సెలబ్రెటీల్లో చాలామంది ఏదో మొక్కుబడిగా వంట చేసేవాళ్లే అయ్యుంటారు. ఒక పద్ధతి ప్రకారం రకరకాల వంటలు చేసే, మంచి రుచి తీసుకొచ్చే పాక శాస్త్ర ప్రావీణ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ అరుదైన జాబితాలో మెగాస్టార్ చిరంజీవిని కచ్చితంగా చేర్చేయొచ్చని ఆయన తాజా వీడియోను బట్టి అర్థమవుతోంది.
చిరు మంచి వంటగాడని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆయన కర్ణాటకలో ఓసారి షూటింగ్ కోసం వెళ్లి వెరైటీ దోసె నేర్చుకుని వచ్చి.. దాన్ని ఇంట్లో ట్రై చేయడం.. తన స్టైల్ కూడా జోడించి అందరినీ మెప్పించడం.. ఇది రుచి చూసిన ఓ హోటల్ యజమాని ‘చిరు దోసె’ పేరుతో తన హోటల్ మెనూలో చేర్చడం తెలిసిన సంగతే.
తాను ట్విట్టర్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో చిరు తన మార్కు దోసెను చాలా చక్కగా తయారు చేసి అమ్మకు రుచి చూపిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని మించిన వీడియోతో చిరు తన ఫాలోవర్లను మురిపించాడు. చింత తొక్కుతో చిన్న చేపల వేపుడు చేసి పెట్టారాయన. ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా నోరూరడం.. చివరికొచ్చేసరికి కడుపు కూడా నిండిపోవడం ఖాయం.
చెయ్యి తిరిగిన చెఫ్ తరహాలో చిరు చక్కగా తన వంటకం గురించి వివరిస్తూ ఏ తడబాటూ లేకుండా చింత పులుపు చేపల వేపుడు చేసిన వైనం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఇది తన చిన్నపుడు తల్లి చేసి ఇచ్చిన వంటకం అట. దాన్ని చిరు ఇప్పుడు వండి తన తల్లికే పెట్టాడు. ఇంతకీ ఆమె తన వంటకం రుచి చూసి ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆమె తిని చాలా బావుందని అనడంతో చిరు ఉప్పొంగిపోయారు. తర్వాత తల్లి చేతితో తనూ ముద్దలు తిన్నారు. చాలా ముచ్చటగా అనిపిస్తున్న ఈ వీడియో ఇన్‌స్టంట్‌గా వైరల్ అయిపోయింది.
This post was last modified on August 10, 2020 3:13 pm
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…