యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయకు.. యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న గొడవ సంగతి తెలిసిందే. విజయ్ వైపు నుంచి అనసూయ మీద ఇప్పటిదాకా ఏ రియాక్షన్ లేదు కానీ.. ఆమె మాత్రం కొన్నేళ్ల నుంచి అతణ్ని టార్గెట్ చేస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ పలికిన ఒక బూతు మాట విషయంలో అప్పట్లో అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది.
ఇటీవల విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘ఖుషి’ పోస్టర్లో తన పేరు ముందు ‘the’ అని పెట్టుకోవడాన్ని ఆమె తప్పుబట్టడంతో తన అభిమానులతో అనసూయకు మరోమారు గొడవ జరిగింది. ఐతే విజయ్‌ను మళ్లీ మళ్లీ అనసూయ టార్గెట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టిన నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో అతడితో తన సమస్య ఏంటో వివరించింది. అంతే కాక తనతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నట్లు కూడా చెప్పింది.
‘‘విజయ్ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులమే. ఐతే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అభ్యంతరకర పదాలను సెన్సార్ వాళ్లు మ్యూట్ చేస్తే.. విజయ్ ఆ సినిమా విడుదలైనపుడు థియేటర్లకు వెళ్లి అభిమానులతో ఆ పదాలు చెప్పించాడు. ఇది ఒక తల్లిగా నన్నెంతో బాధించింది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని విజయ్‌కి చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి.
ధైర్యంగా ఆ బాధ నుంచి బయటికి వచ్చి విజయ్ ప్రొడ్యూస్ చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించా. కానీ విజయ్‌కు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్ చేయడం కోసం చాలామందికి డబ్బులు ఇస్తు్నట్లు తెలిసి షాకయ్యాను. విజయ్‌కి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో ఏమో నాకు తెలియదు. నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత ముఖ్యం’’ అని అనసూయ వివరించింది.
This post was last modified on June 9, 2023 1:02 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…