మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో భోళా శంకర్ ప్రమోషన్ ని మొదలుపెట్టేశారు. ప్రస్తుతం సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఒక కీలక సాంగ్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఈ చిత్రీకరణ తాలూకు మేకింగ్ వీడియోని ఇన్స్ టాలో షేర్ చేస్తానని ముందే చెప్పిన చిరు దానికి తగ్గట్టే వీడియోని వదిలారు. హీరోయిన్ తమన్నా, చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్, బావ సుశాంత్ లతో పాటు కమెడియన్లు హైపర్ ఆది, రఘుబాబు తదితరులంతా ఇందులో భాగమయ్యారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన పాటకు చివర్లో డాన్స్ మొదలుపెట్టడంతో ఆపేశారు.
వేదాళం రీమేక్ గా ఇప్పటికీ నెగటివిటీని మూటగట్టుకున్న భోళా శంకర్ కు ఫస్ట్ ఆడియో సింగ్ మిశ్రమ స్పందన దక్కింది. రొటీన్ గా ఉందని కొందరు, మెల్లగా ఎక్కేస్తుందని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కంటెంట్ ఏదో బలంగా ఉందని చెప్పాలంటే ఇలాంటి మేకింగ్ వీడియోలు వదలడం అవసరమే. చిరు, కీర్తి సురేష్, తమన్నాల మధ్య బాండింగ్ ఆకట్టుకునేలాగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ చూస్తుంటే అన్నయ్య నాటి చిరంజీవి గుర్తుకు వచ్చారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. వెనకాల ట్యూన్ రెగ్యులర్ గానే అనిపిస్తోంది.
ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న భోళా శంకర్ ఈ పాట షూట్ నిన్నటితో మొదలుపెట్టి జూన్ 11 దాకా మెయిన్ క్యాస్టింగ్ మొత్తం మీద జరగనుంది. ఇది పూర్తయ్యాక ఇంకో షెడ్యూల్ తో మొత్తం టాకీ పార్ట్ ఫినిష్ అవుతుందని టాక్. గత ఏడాది గాడ్ ఫాదర్ విషయంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన చిరు ఇప్పుడు మరో రీమేక్ మీద ఆధారపడుతున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి స్ట్రెయిట్ కథలతో బ్లాక్ బస్టర్లు కొడితేనే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతామని అంటున్నారు. మెహర్ రమేష్ కి సైతం ఇది డూ ఆర్ డై పరిస్థితే. యానిమల్, జైలర్, గదర్ 2లతో భోళా శంకర్ పోటీ పడనుంది.
This post was last modified on June 8, 2023 9:59 pm
వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ…
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు…
వైసీపీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) దెబ్బ కొత్తకాదు. ఆయనకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయనను…
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…
గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…