సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ లవ్ లో పడి పెళ్లి పీటలెక్కారు. టాలీవుడ్ లో ఇప్పుడు మరో ప్రేమ జంట వెడ్డింగ్ బెల్స్ మోగించేందుకు రెడీ అవుతుంది. మెగా ఇంట పెళ్లి సందడి మొదలు కాబోతుంది. కొన్ని నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు నిజమయ్యాయి. అందరూ అనుకున్నట్టే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ వేడుక కంటే ముందు ఈ ఇద్దరికీ రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. మెగా ఫ్యామిలీ , కొందరు బందువులు , ఇంకొందరు ఫ్యాన్స్ నడుమ ఈవెంట్ జరగనుంది.
వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘మిస్టర్’. అదే వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా. తర్వాత సంకల్ప రెడ్డి తీసిన అంత్యక్షరి 9000 kmph అనే ప్రయోగాత్మక వీళ్ళకి రెండో సినిమా. ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు గా నిలిచేయాయి. కానీ వాటి ద్వారా ఈ ఇద్దరి మనసులు ఒకటయ్యాయి.
ప్రేక్షకులు తేల్చేసిన ఈ డిజాస్టర్లు ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లిని బ్లాక్ బస్టర్ గా మార్చేశాయి. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం తో పెళ్లి సందడి బిగిన్ అయింది. రేపు నిశ్చితార్థం చేసుకొని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొనున్నారు. మెగా హీరోలంతా ఒకరోజు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి వరుణ్ తేజ్ , లావణ్య ఎంగేజ్మెంట్ లో సందడి చేయనున్నారు.
This post was last modified on June 8, 2023 9:50 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…