ఈ వేసవిలో భారీ చిత్రాల సందడి లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయిందనే చెప్పాలి. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ.. ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేని వేసవి బహుశా ఇదేనేమో. మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసినవి తక్కువే. దసరా, విరూపాక్ష మాత్రమే బాగా డబ్బులు చేసుకున్నాయి. సరైన వినోదం లేక ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ వేసవిలో. ‘విరూపాక్ష’ తర్వాత అయితే పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ప్రతి వారం ఒకటికి మించి సినిమాలు రిలీజవుతున్నా.. ఏవీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. థియేటర్లను కళకళలాడించలేకపోయాయి. ఓ మోస్తరు సినిమా కూడా లేక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత వారం వచ్చిన అహింస, నేను స్టూడెంట్ సర్ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
ఇలాంటి టైంలో కాస్త క్రేజున్న సినిమా పడి, మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్ల పంట పండించుకోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. అనుష్క, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కలయికలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ల కోసం కష్టపడాల్సిన పని లేదు. ప్రేక్షకులు కూడా ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఎందుకో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎంతకీ ఖరారవ్వట్లేదు. బిజినెస్ కూడా దాదాపు పూర్తయినట్లు చెబుతున్నారు కానీ.. రిలీజ్ విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో మరి?
This post was last modified on June 8, 2023 6:23 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…