ఖుషిని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వెంటనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో బిజీ అయిపోతాడు. లైగర్ కొట్టిన దెబ్బ చిన్నది కాకపోవడంతో ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కొంత టైం తీసుకున్న రౌడీ హీరో నిర్మాత దిల్ రాజు దర్శకుడు పరశురామ్ తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఒకేసారి డబుల్ షూటింగులు సమాంతరంగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఖుషి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కాబట్టి 2024లో ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ప్రథమార్థంలో మరొకటి ద్వితీయార్థంలో వస్తుందన్న మాట.
ఇక పరశురామ్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఆ లాంఛనం త్వరలోనే చేస్తారట. ఈ జోడి గతంలోనే కుదరాల్సింది. పూరి జగన్నాధ్ ప్లాన్ చేసుకున్న జనగణమనలో ముందు పూజానే తీసుకుని అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ లైగర్ డిజాస్టర్ ఈ ప్లానింగ్ మొత్తాన్ని చెడగొట్టింది. ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చైనా సరే నిర్మాణ సంస్థ దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ కారణంగా పూజా హెగ్డే డేట్స్ కొన్ని వృధా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దేవరకొండతో జోడి అంటే ఛాన్స్ కొట్టేసినట్టే
సమంతా, పూజా హెగ్డే ఇలా సీనియర్ స్టార్ హీరోయిన్లతో జట్టు కడుతున్న విజయ్ దేవరకొండ ఇకపై రిస్కులకు దూరంగా అన్ని జానర్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. పదే పదే ఓవర్ అగ్రెసివ్ హీరోయిజం పని చేయడం లేదని గుర్తించి ఖుషిలో లవర్ బాయ్, గౌతమ్ తిన్ననూరిలో పోలీస్ ఆఫీసర్ కం గూడచారి ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. పరశురామ్ తో చేయబోయే సినిమా తాలూకు లీక్ మాత్రం ఇంకా బయటికి రాలేదు. సదరు దర్శకుడికి ఇతర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకున్న వ్యవహారం సెటిలయ్యాక సినిమాకు సంబంధించిన వార్తలు మొదలవుతాయి
This post was last modified on June 8, 2023 5:22 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…