ముదిరిపోతున్న ముద్దు వివాదం

మొన్న తిరుమల కొండపై దర్శకుడు ఓం రౌత్ హీరోయిన్ కృతి సనన్ ను ముద్దు పెట్టుకుని సెండ్ అఫ్ ఇచ్చిన వ్యవహారం అంతకంతా ముదిరిపోతోంది. పవిత్రమైన చోట ఇలాంటివి చేయడం తగదని, ఎంత ముంబైలో చుంబనాలు సహజమే అయినా మనం ఎక్కడ ఉన్నామో గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు తలంటుతున్నారు. పలువురు ఆలయ పూజారులు సైతం గొంతు కలపడం విశేషం. చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు ఈ సంఘటన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీతగా కృతి సనన్ సూటవ్వలేదని తేల్చేశారు.

ఇప్పుడిది నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఓం రౌత్ యథాలాపంగా చేసినా మీడియా కెమెరాల ముందు అందులోనూ ఏడుకొండల వాడి గుడి దగ్గర ఇలా చేయడం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసేదే. కాకపోతే అతను వీలైనంత తొందరగా స్పందించి క్షమాపణ చెప్పడమో లేదా అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వడమో చేసి ఉంటే బాగుండేది. బయట జరుగుతున్న రచ్చ తనకు తెలియకుండా అయితే పోదు. పబ్లిసిటీ వస్తోందని ఊరికే ఉన్నారో లేక ఏం మాట్లాడితే దానికి ఇంకేం కొత్త అర్థాలు తీస్తారని భయపడుతున్నారో అంతు చిక్కడం లేదు.

ఇదంతా అవసరం లేని ప్రచారం. ఆదిపురుష్ కి అంతా పాజిటివ్ వాతావరణం కనిపిస్తున్న టైంలో ఇవన్నీ చికాకు కలిగించేవే. సినిమా గురించి హైప్ పెరగాలి ఈ తరహా వివాదాల వల్ల ఓపెనింగ్స్ కు వచ్చే మేలు ఏమీ ఉండదు. పైగా ప్యాన్ ఇండియా అంచనాలు అందుకోవడం గురించి ఆదిపురుష్ మీద ఇప్పటికే విపరీతమైన ఒత్తిడి ఉంది. రాష్ట్రాల వారిగా వందల కోట్లతో బిజినెస్ చేశారు. కనీసం రెండు మూడు వారాలు హౌస్ ఫుల్స్ పడితేనే నిలబడుతుంది. సరిపడా బజ్ అయితే ఉంది కానీ ఇలా కాంట్రావర్సీలతో పక్కదారి పట్టడం మాత్రం సేఫ్ కాదు. త్వరగా చెక్ పెట్టేయాలి