ఈ ఏడాది సమ్మర్ సినిమాలు ఆశించిన స్థాయిలో భారీ విజయాలు అందుకోలేదు. సాయి తేజ్ ‘విరూపాక్ష’ మినహా మిగతా సినిమాలు ఊహించిన స్థాయిలో సౌండ్ చేయలేదు. ‘మేమ్ ఫేమస్’ కూడా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకొని ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకుంది తప్ప సూపర్ హిట్ దిశగా అడుగులు వేయలేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ పై కొంత నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత ట్రైలర్ ఆకట్టుకుంది. అక్కడి నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో రూపొందిన సినిమా అయినప్పటికీ ఆ టెక్నాలజీ ను పర్ఫెక్ట్ గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక “జై శ్రీరామ్” సాంగ్ , తిరుపతిలో భారీ ఈవెంట్.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే కంటెంట్ ఏ మాత్రం బాగున్నా ప్రభాస్ ఆది పురుష్ తో వరల్డ్ వైడ్ గా అద్భుతం చేయడం పక్కా అనిపిస్తుంది. నార్త్ లో ప్రభాస్ కి ‘బాహుబలి’ , ‘సాహో’ సినిమాలు తెచ్చిన ఇమేజ్ తో పాటు రామజపంతో అక్కడ మంచి కలెక్షన్స్ తెచ్చే అవకాశం ఉంది.
కాకపోతే స్కూల్ ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతుండటం కొంత ఎఫెక్ట్ పడనుంది. సమ్మర్ హాలిడేస్ లో అయితే పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండేది. మరి చూడాలి రామాయణంలోని ముఖ్య భాగంతో ఓం రౌత్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూళ్లు అందుకుంటుందో ?
This post was last modified on June 8, 2023 12:05 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…