తిరుపతి లో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున ప్రభాస్ అభిమానులు , మూవీ లవర్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే టీం ముందు నుండి ఈవెంట్ కి తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసి ఎక్కడా సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్యక్రమంలో ప్రభాస్ ధనుస్సు పట్టుకోవడం హైలైట్ గా నిలిచింది. అలాగే తిరుపతిలో అయోధ్య సెట్ కూడా ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిల్లలతో పెర్ఫార్మెన్స్ , గ్రూప్ సింగర్స్ తో జై శ్రీరామ్ అంటూ హొరెత్తేలా పాడించడం , వచ్చిన అందరికీ ప్రాంగణంలో సరిపడేలా ప్లాన్ చేయడం ఇలా అన్నీ బాగా కుదిరాయి.
రెగ్యులర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా కాకుండా సినిమాకి తగ్గట్టుగా ప్లాన్ చేశారు. దీని వెనుక హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కష్టం ఉంది. షో ప్రోమోస్ , భారీ సెట్టింగ్స్ , స్పెషల్ డిజైనింగ్ , ఈవెంట్ ఐడియాలు వీటికి ప్రెజెంట్ ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలో ఫేమస్. అందుకే ప్రభాస్ , యూవీ కోసం ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. రెండు మూడు వారాలుగా ఈవెంట్ కోసం ప్లానింగ్ రెడీ చేసి రెండ్రోజుల ముందే తిరుపతి వెళ్ళి ఏర్పాట్లు చూసుకున్నాడు. అందుకే ప్రభాస్ స్పీచ్ లో ప్రశాంత వర్మ కి థాంక్స్ చెప్పుకున్నాడు.
రామాయణంలో శ్రీరాముడికి హనుమాన్ సాయం చేస్తే, శ్రీరాముడి కథతో వస్తున్న ఆదిపురుష్ ఈవెంట్ కి హనుమాన్ దర్శకుడు సాయం అందించి ఈవెంట్ సక్సెస్ అయ్యేలా కృషి చేయడం విశేషం.
This post was last modified on June 8, 2023 9:05 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…