Movie News

టాప్ 50 వెబ్ సిరీస్ జాబితాలో ట్విస్టులు

సినిమాల విషయంలో IMDB(ఐఎండిబి)కున్న ప్రామాణికత గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఇచ్చే రివ్యూలు రేటింగ్స్ ఆధారంగా ఈ సంస్థ వెబ్ సైట్ లో ఉండే స్పందనని బట్టి చూడాలా వద్దాని నిర్ణయించుకునే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. ఓటిటిలు సైతం ఇక్కడి రెస్పాన్స్ ని బట్టే డిజిటల్ హక్కులకు ఎంత ఇవ్వాలో ఫిక్స్ అవుతాయి. ప్రతి ఏడాది టాప్ మూవీస్, సెలబ్రిటీస్ లిస్టు విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి టాప్ ఇండియన్ 50 వెబ్ సిరీస్ పేరుతో ఒక జాబితాని రిలీజ్ చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి

అగ్ర స్థానంలో సైఫ్ అలీ ఖాన్-నవాజుద్దీన్ సిద్ధిక్ ల సాక్రెడ్ గేమ్స్ ఉండగా రెండు మూడు ర్యాంకుల్లో  మీర్జాపూర్, స్కామ్ 1992 చోటు దక్కించుకున్నాయి. బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ నాలుగో ప్లేస్ లో సర్దుకుంది. ఆపై వరసగా యాస్పిరెంట్స్, క్రిమినల్ జస్టీస్, బ్రీత్, కోటా ఫ్యాక్టరీ, పంచాయత్, పాతాళ లోక్, స్పెషల్ ఓపీఎస్, అసుర్, కాలేజ్ రొమాన్స్, అపహరన్, ఫ్లేమ్స్, దిండోరా, ఫర్జి, ఆశ్రమ్, ఇన్ సైడ్ ఎడ్జ్, అన్ దేఖీలు కొనసాగాయి. ఎంతో ఆదరణ పొందిన ఢిల్లీ క్రైమ్, రాకెట్ బాయ్స్ 24,25 స్థానాల్లో ఉండగా యూత్ ని ఆకట్టుకున్న హాస్టల్ డేజ్ 31లో ఉంది.

హాట్ కంటెంట్ తో వచ్చిన లస్ట్ స్టోరీస్, షీలకు అసలు చోటే దక్కలేదు. వెంకటేష్ రానా నాయుడుకి అతి కష్టం మీద 41 ర్యాంక్ అందుకుంది. తెలుగు తమిళంలో స్ట్రెయిట్ గా రూపొందిన ఏ వెబ్ సిరీస్ ఈ లిస్టులో లేదు. సెక్స్, వయొలెన్స్ ఉంటేనే ఆడియన్స్ వీటిని చూస్తారన్న భ్రమలను ఐఎండిబి కొంత మేరకు తగ్గించగలిగింది. టాప్ టెన్ లో ఉన్న వాటిలో ఒక్క మీర్జాపూర్ మాత్రం మితిమీరిన హింస బూతులతో ఉంటుంది. మిగిలినవన్నీ అంత తీవ్ర స్థాయిలో ఉండవు. కంటెంట్ బలంగా ఉంటే నిజాయితీకి పట్టం దక్కుతుందని స్కామ్ 1992, రాకెట్ బాయ్స్ నిరూపించాయి 

This post was last modified on June 7, 2023 8:11 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago