బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల కోసం ఎదురుచూపులు  

ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. తెల్లవారుఝామున 4 గంటల నుంచి వేయడం సాధారణంగా స్టార్ హీరోల విషయంలో పాటించే ఆనవాయితీ. అయితే ఫస్ట్ షోకు సంబంధించి  టి సిరీస్ అధినేతలు ఏదో ముహూర్త బలం కోసం చూస్తున్నారట. ఒకవేళ అది డిసైడ్ అయితే దాని ప్రకారమే టైమింగ్ ఉండొచ్చు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూస్తున్న మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వీలైనన్ని ఎక్కువ షోలు మొదటి రోజు పడేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో అనుమతులు కీలకం కానున్నాయి

టికెట్ రేట్ల పెంపు గురించి ఇప్పటిదాకా ఎలాంటి లీకు బయటికి రాలేదు. నైజామ్ లో సహజంగా ఉండే గరిష్ట మల్టీప్లెక్స్ ధర 295 రూపాయలు ఎలాగూ పెడతారు. దీనికన్నా ఎక్కువ కావాలంటే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అంటే 345 అవుతుంది. దీనికి త్రీడి గ్లాస్ చార్జీలు ముప్పై రూపాయలు అదనం. అదే ఏపీలో గరిష్ట ధర 177 మాత్రమే ఉంది. ఇది పెంచుకోకుంటే వర్కౌట్ కావడం కష్టం. అయితే యువి  వాళ్లకు జగన్ బృందంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అదేమీ కష్టం కాదు. కాకపోతే మహా అయితే 40 నుంచి 50 రూపాయల కన్నా హైక్ ఉండకపోవచ్చు. ఆర్ఆర్ఆర్ కు ఇలాగే చేశారు.

ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో ట్రైలర్లు కాగల కార్యాన్ని పూర్తి చేసి పెట్టాయి. విజువల్ ఎఫెక్ట్స్ మీద కామెంట్స్ ఇంకా కొన్ని ఉన్నప్పటికీ సినిమా కంటెంట్ జనాన్ని లీనం చేస్తే లోపాలను పట్టించుకోరనే ధీమా ఓం రౌత్ బృందంలో కనిపిస్తోంది. పైగా వేసవిలో కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఏవీ రాకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కరువులో ఉన్నారు. కాబట్టి ధర కాస్త ఎక్కువే ఉన్నా కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటి రోజు టాక్ సానుకూలంగా వస్తే చాలు ఫస్ట్ వీక్ మొత్తం అడ్వాన్స్  ఫుల్ అయిపోతుంది. ఫైనల్ గా షోలు టికెట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో