‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల జోరు పెంచుతోంది చిత్ర బృందం. మంగళవారమే తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. అంతకు ఒక్క రోజు ముందే చిత్ర బృందం వేసిన ప్రమోషన్ ఎత్తుగడ చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా ఆడబోయే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్‌ను ఖాళీగా ఉంచబోతున్నామని.. అది హనుమంతుడి కోసం కేటాయిస్తున్నామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ పట్ల ప్రేక్షకుల్లో భక్తి భావాన్ని, ఉద్వేగాన్ని పెంచే ఉద్దేశంతో టీం ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆలోచనను కొందరు స్వాగతించగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో.
హనుమంతుడి కోసం సీట్ కేటాయించడం వెటకారాలాడుతూ చాలా మీమ్సే పడుతున్నాయి సోషల్ మీడియాలో. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో లేని తన అసిస్టెంట్‌ను ఉన్నట్లు ఊహించుకునే వెన్నెల కిషోర్‌తో బ్రహ్మానందం తంటాలు పడే సీన్.. అలాగే ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో తనకు మాత్రమే కనిపించే హనుమంతుడితో నితిన్ మాట్లాడుతూ మిగతా వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసే సన్నివేశం.. ఇలాంటివి పట్టుకొచ్చి ‘ఆదిపురుష్’ టీంను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా రకరకాల ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. పాత రోజుల్లో అయితే ఇలాంటి ఐడియాలకు జనాలు పడిపోయి ఎమోషనల్ అయిపోయేవారని.. ఈ రోజుల్లో ఇలాంటి వర్కవుట్ కావని కొందరు విమర్శిస్తుండగా.. కొందరు మాత్రం ఇది కచ్చితంగా వర్కవుట్ అయ్యే ఐడియా అని.. ‘ఆదిపురుష్’ను ఒక వర్గం బాగా ఓన్ చేసుకుంటుందని అంటున్నారు.
This post was last modified on June 6, 2023 7:01 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…