హిట్టు కొట్టి విదేశాలు చుట్టేస్తున్నాడు 

ఈరోజుల్లో దర్శకులకి సక్సెస్ అనేది ఎంతో కీలకంగా మారింది. అందుకే ఒక హిట్టు కొడితే చాలు ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోతూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు వేణు కూడా దర్శకుడిగా తన  సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయాడు. ‘బలగం’ తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి హిట్టుతో పాటు ప్రశంసలు కూడా అందుకున్న వేణు టిల్లు మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ తో విదేశాలు చుట్టేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. 

‘బలగం’ రిలీజైన నెల రోజుల పాటు ప్రమోషన్స్ తో హైదరాబాద్ లోనే గడిపేసిన వేణు ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగానే హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే తన మిత్రులతో రెండు మూడు వెకేషన్స్ చూట్టేసిన వేణు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. డల్లాస్ సిటీలో ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టాడు వేణు. 

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో మొదటి సినిమా చేసిన వేణు ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో రెండో సినిమా చేయబోతున్నాడు. ‘బలగం’ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో దిల్ రాజు వేణుకి భారీ బడ్జెట్ తో పాటు కథకి సూటయ్యే  కాస్ట్ , టాలెంటెడ్ క్రూని ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఓ పాయింట్ చెప్పి దిల్ రాజు నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్న వేణు ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ మరో వైపు రైటింగ్ చేసుకుంటున్నాడు.