సిద్దు జొన్నలగడ్డ రేంజ్ ని ఒక్క సినిమాతో మార్చేసిన డీజే టిల్లుకి సీక్వెల్ శరవేగంగా రూపొందుతోంది. విడుదల తేదీని తొలుత ఆగస్ట్ 11 అనుకున్నారు కానీ ఆ టైంలో భోళా శంకర్, జైలర్, యానిమల్, గదర్ 2 లాంటి క్రేజే మూవీస్ ఉండటంతో అనవసరమైన పోటీ కన్నా సోలోగా వచ్చి వసూళ్లు కొల్లగొట్టుకోవడం మంచిదని నిర్ణయించుకుని కొత్త రిలీజ్ డేట్ సెప్టెంబర్ 15 లాక్ చేసుకున్నారు. ఇప్పటికైతే ఆ డేట్ కి చెప్పుకోదగ్గ ఏ టాలీవుడ్ మూవీ షెడ్యూల్ కాలేదు. ముందే టిల్లు స్క్వేర్ కర్చీఫ్ వేసింది కాబట్టి నెక్స్ట్ ఎవరొచ్చినా ఇబ్బందుండదు. వచ్చే అవకాశాలూ పెద్దగా లేవు.
చాలా తెలివిగా ఈ డేట్ ని సెట్ చేసింది సితార ఎంటర్ టైన్మెంట్. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ వస్తోంది. దాని ప్రభావం హిందీ మార్కెట్ లోనే ఎక్కువ కాబట్టి మనకు ఇబ్బంది లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇతర స్టార్లెవరూ దానికి ముందు వెనుక తమ సినిమాలను ప్లాన్ చేసుకోలేదు. సో టిల్లు 2 వచ్చేనాటికి థియేటర్లు చాలా అందుబాటులో ఉంటాయి . ఎలాగూ సితార బ్యానర్, తర్వాత గుంటూరు కారం ఇస్తారనే ఉద్దేశంతో బయ్యర్లు పూర్తిగా మద్దతు ఇస్తారు. డీజే టిల్లు టైంలో అచ్చం ఇలాగే భీమ్లా నాయక్ ముందు సెట్ చేసుకోవడం బిజినెస్ పరంగా హెల్ప్ అయ్యింది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న టిల్లు స్క్వేర్ లో రొమాన్స్ డోస్ ఏమి తగ్గదని పోస్టర్లు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదికి పైగా వేరే సినిమా ఒప్పుకోకుండా దీని మీదే ఉండటంతో సిద్దు జొన్నలగడ్డకి ఇది ఫస్ట్ పార్ట్ కన్నా పెద్ద హిట్టు కావడం చాలా అవసరం. పైగా దర్శకుడు మారడం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తన నిర్ణయం కరెక్టని నిరూపించుకోవాల్సిన బాధ్యత డైరెక్ట్ చేస్తున్న మల్లిక్ రామ్ తో పాటు సిద్ధూ మీద కూడా ఉంది. విజయ్ దేవరకొండ ఖుషి వచ్చిన రెండు వారాలకు దిగుతున్న టిల్లు స్క్వేర్ ఈసారి ఏం మేజిక్ చేయబోతున్నారో
This post was last modified on June 5, 2023 5:55 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…