సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఒక కుర్రాడితో డేటింగ్ చేస్తోందని.. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇటీవల మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే మీడియా వార్తల్లో కనిపిస్తున్న వ్యక్తి తన స్నేహితుడు మాత్రమే అని కీర్తి క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లు ఆగట్లేదు. చివరికి కీర్తి తల్లిదండ్రులు సైతం ఈ వార్తలపై స్పందించారు.
కీర్తి పెళ్లి కుదిరినపుడు తామే అధికారికంగా ప్రకటిస్తామని.. అంతవరకు ఇలాంటి ప్రచారాలు కట్టిపెట్టాలని మీడియాకు క్లాస్ పీకారు. అయినా సరే.. కీర్తి పెళ్లి గురించి మీడియా శూల శోధనలు ఆగట్లేదు. తాజాగా కీర్తి.. తమిళంలో నటించిన ‘మామన్నన్’కు సంబంధించి చెన్నైలో ఒక ప్రెస్ మీట్లో పాల్గొంది. ఇక్కడ కూడా మధ్యలో విలేకరులు కీర్తిని పెళ్లి గురించి ప్రశ్నించారు.
సినిమా ప్రెస్ మీట్లో వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న ఎదురవడంతో కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ‘‘నా పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి ఇప్పటికే నేను ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు? ఆ విషయంపై ఎందుకింత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను.
దాని గురించి ప్రెస్ మీట్లలో ప్రతిసారీ అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు.. సినిమాకు సంబంధించినవి అడగండి’’ అని కీర్తి పేర్కొంది. పరియేరుం పెరుమాల్, కర్ణన్ లాంటి క్లాసిక్స్ తీసిన మారి సెల్వరాజ్ రూపొందించిన చిత్రం ‘మామన్నన్’. ఇందులో కీర్తితో పాటు వడివేలు, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తెలుగులో కీర్తి.. చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో నటిస్తోంది. దీంతో పాటు ఆమె రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ లీడ్ రోల్ చేస్తోంది.
This post was last modified on June 4, 2023 1:28 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…