మెగాస్టార్ చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నట్లు.. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించినట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. చిరు అంత పెద్ద జబ్బు బారిన పడ్డారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఐతే ఈ వార్తలు వైరల్ కావడంతో చిరు ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. తాను గతంలో క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వల్ల దాని బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు చెప్పానే తప్ప.. తనకు క్యాన్సర్ రావడం, కోలుకోవడం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
”కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్‌గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్‌గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non -cancerous polypsని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్‌లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేకమందిని భయభ్రాంతుల్ని చేసి బాధపెట్టిన వారవుతారు” అని చిరు కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించారు.
This post was last modified on June 3, 2023 11:31 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…