Movie News

సమ్మర్ ముగిసింది.. నిరాశే మిగిలింది

టాలీవుడ్లో షార్ట్ సీజన్ల వరకు సంక్రాంతి బిగ్గెస్ట్ సీజన్ అయితే.. వేసవి అనేది దీర్ఘ కాలం పాటు బాక్సాఫీస్‌కు కాసుల వర్షం కురిపించే సీజన్. ఈ టైంలో పెద్ద హీరోలు నటించిన భారీ చిత్రాలు కనీసం మూడు నాలుగు అయినా రిలీజవుతుంటాయి. గత ఏడాది అయితే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్-2 లాంటి పెద్ద సినిమాలు ఈ సీజన్లోనే సందడి చేశాయి.

కానీ ఈ ఏడాది వేసవికి పెద్ద సినిమాల సందడే లేకపోయింది. టాప్ స్టార్లు నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అదే అత్యంత నిరాశ కలిగించే విషయం అయితే.. గత రెండు నెలల్లో రిలీజైన మిడ్ రేంజ్ సినిమాల్లో సందడి చేసినవి తక్కువ కావడం మరింత నిరాశ పరిచేదే. క్రేజీ సీజన్లో బాక్సాఫీస్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న సినిమాలు కేవలం రెండు మాత్రమే.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మార్చి 30న రిలీజై బాక్సాఫీస్‌ను కళకళలాడించింది. ఆ సినిమాకు కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని నిలబడింది. పెద్ద సినిమాలకు దగ్గరగా ఈ చిత్రం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కాకపోతే సినిమాకు లాంగ్ రన్ లేకపోయింది. వేసవిలో ఎక్కువ వారాలు సందడి చేసిన సినిమా అంటే.. విరూపాక్షనే అని చెప్పాలి. ఈ సినిమా డల్ నోట్‌తో మొదలైనప్పటికీ.. టాక్ బాగుండటంతో బలంగా పుంజుకుంది.

నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టి.. పెట్టుబడి-రాబడి కోణంలో సమ్మర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇవి కాకుండా మిడ్ రేంజ్ సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. ఏజెంట్ సమ్మర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవగా.. రామబాణం, రావణాసుర, శాకుంతలం, కస్టడీ లాంటి పేరున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బ తిన్నాయి.అనువాద చిత్రాల్లో బిచ్చగాడు-2, 2018, విడుదల ఆకట్టుకున్నాయి.

మిగతా సినిమాలన్నీ కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయి. ‘అన్నీ మంచి శకునములే’, ‘రంగమార్తాండ’ మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నా వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘ఉగ్రం’, ‘మేమ్ ఫేమస్’ ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టాయి. ‘మీటర్’, ‘మళ్ళీ పెళ్ళి’ లాంటి సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్నట్లు తయారైంది పరిస్థితి. ఈ వారం రిలీజైన అహింస, నేను స్టూడెంట్ సర్, పరేషాన్ చిత్రాలు కూడా నెగెటివ్ టాక్‌తోనే మొదలై.. వేసవికి పేలవమైన ముగింపునిచ్చాయి.

This post was last modified on June 3, 2023 11:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

1 minute ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

46 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

50 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

57 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

2 hours ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

2 hours ago