వచ్చే వారం జూన్ 10న రీ రిలీజ్ కాబోతున్న నరసింహనాయుడు మీద బయ్యర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నట్టు బిజినెస్ డీల్స్ చూస్తే అర్థమైపోతుంది. 2001లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు. ప్రత్యేకంగా ప్రింట్ ని రీ మాస్టర్ చేయించి సెవెన్ పాయింట్ వన్ సౌండ్ తో సరికొత్త అనుభూతిని దక్కించుకోవచ్చని నిర్మాతలు చెబుతున్నారు. దానికి తగ్గట్టే ఏపీ తెలంగాణలో థియేటర్లు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ బస్టర్ కి టైమింగ్ బాగా కలిసి వస్తోంది
జూన్ 9న సిద్దార్థ్ టక్కర్ ఉంది. దాని మీద భారీ అంచనాలేం లేవు. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే చెప్పలేం కానీ ఆడియన్స్ కి పెద్దగా ఇంటరెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు. బిగ్ బాస్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన అన్ స్టాపబుల్ అదే రోజు వస్తోంది. దీనికి బజ్ ఎంత వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముతిరఖని అనసూయల విమానం కాన్సెప్ట్ అండ్ కంటెంట్ నమ్ముకుని వస్తోంది. థియేటర్లకు జనం రావాలంటే ఏదో అద్బుతం జరగాల్సిందే. సో ఎలా చూసుకున్నా మాస్ ఆడియన్స్ కి ఆ మరుసటి రోజు వచ్చే నరసింహనాయుడునే బెస్ట్ ఆప్షన్ గా కనిపించనుంది
ఎలాగూ పుట్టినరోజు కాబట్టి ఈ రిలీజ్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తున్న భగవత్ కేసరి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ 10నే రానుంది. దాన్ని థియేటర్లలో నరసింహనాయుడుతో పాటుగా లాంచ్ చేయబోతున్నారు. ఇంతకన్నా అకేషన్ అభిమానులకు ఇంకేముంటుంది. ఇంకోవైపు భైరవ ద్వీపం కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ దానివైపు అంతగా ఆసక్తి కలగడం లేదు. ఎంత క్లాసిక్ అయినా సరే అవతల అదే హీరో కమర్షియల్ సునామితో తలపడటం సరికాదనే అభిప్రాయం కరెక్టే
This post was last modified on June 3, 2023 4:30 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…