నిన్న విడుదలైన సినిమాల్లో యూత్ పరంగా అంతో ఇంతో బజ్ ఉన్నది ఒక్క పరేషాన్ మీదే. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించడంతో సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేగింది. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో మాసూద ఫేమ్ తిరువీర్ హీరోగా నటించాడు. అయితే పరేషాన్ టైటిల్ కు తగ్గట్టే నిర్మాతను రానాను ఖంగారు పెట్టించేలా ఉంది. రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ అంతంత మాత్రంగా ఉండటం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తోంది. నైజామ్ పరిస్థితి కొంత వరకు నయమనుకుంటే ఏపీలో మాత్రం మరీ నీరసంగా సాగుతోంది.
వయసొచ్చిన కుర్రాళ్ళ మధ్య స్నేహం, పార్టీ కల్చర్, బేవార్స్ తిరుగుళ్ళు, ఇంట్లో వాళ్లతో తిట్టించుకోవడం, అనక సమస్యలు కొని తెచ్చుకోవడం, వాటి పరిష్కారాల కోసం కిందా మీద పడటం ఇలా పరేషాన్ మొత్తం మనకు అలవాటైన బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అక్కడక్కడా పేలిపోయే జోకులు ఉన్నప్పటికీ సినిమా మొత్తాన్ని మోయడానికి అవి సరిపోలేదు. కేవలం ఫన్ సీన్స్ మీద ఆధారపడి కథాకథనాలను లైట్ తీసుకోవడంతో తేడా కొట్టేసింది. సెకండ్ హాఫ్ లో చాలా మటుకు భరించలేనంత ప్రహసనాన్ని జొప్పించాడు డైరెక్టర్ రూపక్ రొనాల్ట్ సన్.
తెలంగాణ యూత్ ని పదే పదే మందు బాబులుగా చూపించడం పట్ల సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. పరేషాన్ లో దీన్ని కాస్త ఓవర్ డోస్ చేసి చూపించడంతో కొత్త అనే అనుభూతి కలగదు. ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా సింపుల్ లైన్ మీద ఇంత ల్యాగ్ తో కంటెంట్ ప్రెజెంట్ చేయడం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో కనీసం మేం ఫేమస్ స్థాయిలో పరేషాన్ ఉన్నా దాని లాగే హిట్టయ్యే ఛాన్స్ ఉంది. కానీ పరేషాన్ కు అంత సీన్ లేకపోయింది. ఏదో అద్భుతం చేస్తుందనుకుని దగ్గరుండి ప్రమోషన్లు చేసిన రానాకు పెద్ద పరేషానే మిగిలింది
This post was last modified on June 3, 2023 4:02 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…