కూల్ ఫ్యామిలీ మూవీస్ తీయడంలో ఎంత పేరున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిప్రాయం ఉంది. బ్రహ్మోత్సవం ఫలితం తేడా రాకపోయి ఉంటే ఇంకొన్ని కుటుంబ చిత్రాలు వచ్చేవి కానీ దాని డిజాస్టర్ దెబ్బకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. రీమేక్ అయినా నారప్పని డీల్ చేసిన తీరు అడ్డాలని సీరియస్ జానర్ వైపు తీసుకొచ్చింది. నిన్న ప్రకటించిన పెద కాపు సినిమా మీద ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒక సామజిక వర్గాన్ని నేరుగా ప్రతిబింబించేలా టైటిల్స్ పెట్టడం గతంలో జరగలేదు. ఇదో ట్రెండ్ గా మారొచ్చనే అంచనాలున్నాయి.
పెద కాపు మొత్తం మూడు భాగాలుగా వస్తుందట. దీనికి అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ ని మోడల్ గా తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. భిన్న కులవర్గాల పోరులో అగ్ర వర్ణాలు సామాన్యుల మధ్య జరిగే పోరు ఎలాంటి మాఫియాలకు గూండాయిజంలకు దారి తీస్తుందో అందులో అద్భుతంగా చూపించారు. మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ నటన పీక్స్ లో కనిపిస్తుంది. వసేపూర్ ఫస్ట్ పార్ట్ ఆ తర్వాత సీక్వెల్ రెండింటికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కల్ట్ స్టేటస్ దక్కింది. అయితే పెద కాపు మూడు భాగాలు అంటే సుమారు ఏడున్నర గంటలకు పైగానే నిడివి ఉంటుంది.
ఒక వెబ్ సిరీస్ కు సరిపడే కంటెంట్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించబోవడం ఒకరకంగా సాహసమే. అందులోనూ కొత్త హీరో. అఖండ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి దీని మీద పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. సహజంగా స్లో నెరేషన్ ఫాలో అయ్యే శ్రీకాంత్ అడ్డాల పెద కాపు విషయంలో మాత్రం కొంత స్పీడ్ ని పాటించాల్సి ఉంటుంది. మరీ నెమ్మదిగా చెప్పినా ఇబ్బందే. కొత్త కుర్రాడు విరాట్ కర్ణ లుక్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా టీజర్ లాంటివేమీ రాలేదు కాబట్టి యాక్టింగ్ గురించి ఒక అంచనాకు రాలేం. ఇంత ఇంటెన్స్ డ్రామాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ని ఎంచుకోవడం విశేషం.
This post was last modified on June 3, 2023 11:13 am
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు…
మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన…
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…