టాలీవుడ్లో మరో పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. మామూలుగా పెద్ద కుటుంబాల నుంచి ఒక హీరో అరంగేట్రం చేస్తుంటే ఉండే హడావుడి ఆ హీరో విషయంలో కనిపించడం లేదు. ఆ కుర్రాడు దగ్గుబాటి కుటుంబానికి చెందిన అభిరామ్ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. మిగతా కుటుంబాలతో పోలిస్తే దగ్గుబాటి ఫ్యామిలీ మామూలుగానే హడావుడికి దూరంగా ఉంటుంది.
రానా లాంచింగ్ కూడా కొంచెం సింపుల్‌గానే జరిగింది. అతణ్ని మాస్ హీరోను చేసేయాలన్న ఆలోచనేమీ సురేష్ బాబులో కనిపించలేదు. రానా తనకు తానుగా భిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించాడు. అభిరామ్‌ను సైతం మిగతా వారసుల తరహాలో మాస్ హీరోను చేయాలని చూడకుండా.. సీనియర్ దర్శకుడు తేజతో ‘అహింస’ సినిమాలో సగటు కుర్రాడి పాత్రలో లాంచ్ చేయిస్తున్నారు.
ఈ సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం కావడం.. ప్రోమోలు మరీ గొప్పగా ఏమీ అనిపించకపోవడంతో బజ్ తక్కువగానే ఉంది. ప్రోమోల్లో అసలు అభిరామ్‌ను ఎక్కువగా ఎలివేట్ చేయడానికి కూడా చూడలేదు. ముందే అంచనాలు పెంచకుండా.. కంటెంట్‌తో, తన పెర్ఫామెన్స్‌తో మెప్పించాలన్న ప్రయత్నం వల్ల కూడా ఇలా చేసి ఉండొచ్చు. ఐతే బాక్సాఫీస్ దగ్గర ‘అహింస’కు అనుకూల పరిస్థితులే ఉన్నాయి.
గత కొన్ని వారాల్లో వచ్చిన సినిమాల్లో ఏవీ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపట్లేదు. ‘అహింస’కు పోటీగా రిలీజవుతున్న ‘నేను స్టూడెంట్ సార్’, ‘పరేషాన్’ చిత్రాలకు బజ్ తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో టాక్ బాగుంటే ‘అహింస’నే ఈ వారం బాక్సాఫీస్ లీడర్ కావచ్చు. మరి సరైన ఫామ్‌లో లేని తేజ ఎలాంటి సినిమా తీశాడో.. అభిరామ్‌ను ఎంత బాగా ప్రెజెంట్ చేశాడో చూడాలి మరి. ఈ చిత్రంతో గీతిక అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది.
This post was last modified on June 2, 2023 11:55 am
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…