ఇండస్ట్రీ లో ఓ అగ్ర కుటుంబం నుండి ఎవరైనా హీరో పరిచయం అవుతుంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. ఫస్ట్ లుక్ నుండే ఆ సినిమాపై హైప్ తీసుకొస్తూ హీరోను గట్టిగా ప్రమోట్ చేస్తుంటారు. అయితే దగ్గుబాటి హీరో డెబ్యూకి మాత్రం ఆ హంగామా ఏ మాత్రం కనిపించడం లేదు. దగ్గుబాటి కుటుంబం నుండి అభిరామ్ ‘అహింస’ తో డెబ్యూ ఇస్తున్నాడు. ఈ సినిమా జూన్ 2న రిలీజవుతుంది. రామనాయుడు మనవడు , సురేష్ బాబు కొడుకు , రానా తమ్ముడు ఇలా అభిరామ్ కి ఎక్స్ట్రా టాగ్స్ ఉన్నాయి.
కానీ ప్రమోషన్ లో మాత్రం ఆ ట్యాగ్ కనిపించకుండా సినిమాకు దూరంగా ఉంటున్నారు దగ్గుబాటి కుటుంబం. ముఖ్యంగా రానా ‘అహింస’ ప్రమోషన్ కోసం వచ్చింది ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే. ఒక పక్క తన ప్రెజెంట్స్ తో రిలీజ్ అవుతున్న పరేషాన్ ను గట్టిగా ప్రమోట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసే పనులన్నీ చేస్తూనే ఉన్నాడు రానా. ఆ సినిమాకి సంబంధించి టీంతో కలిసి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తాజాగా తన తోటి హీరోలను , దర్శకులను ఇన్వైట్ చేసి ఆ సినిమాకు చిన్న ఈవెంట్ చేశాడు.
కానీ తమ్ముడు అభిరామ్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా రానా చొరవ కనిపించడం లేదు. కనీసం అభిరామ్ తో రానా ఓ ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. వెంకటేష్ , రానా ఇద్దరు కలిసి సినిమాను ఇంకా ప్రమోట్ చెయ్యచ్చు కానీ ఆ ఆసక్తి వారిలో కనిపించడం లేదు. ఇద్దరూ చెరొక ఈవెంట్ కి వచ్చి చేతులు దులుపుకున్నట్టుగా ఉంది. ఇక తమ్ముడి సినిమాను ప్రమోట్ చేయకపోగా , పరేషాన్ సినిమాను ప్రమోట్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ మీద ఆ సినిమాను రిలీజ్ చేస్తూ తమ్ముడికి పోటీ ఇస్తున్నాడు రానా. మరి హీరో గా అభిరామ్ పై నిర్మాతగా రానా పై చేయి సాదిస్తాడేమో చూడాలి.
This post was last modified on June 1, 2023 11:32 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…