బాలకృష్ణ , అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ యాక్షన్ డ్రామా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. ఇందులో సరికొత్త లుక్ , ఆకట్టుకునే గెటప్ తో బాలయ్య కనిపించనున్నాడు. సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడతారని ఇన్ సైడ్ టాక్ ఉంది. అలాగే ఇందులో ఫాదర్ , డాటర్ మధ్య సెంటిమెంట్ డ్రామా ఉంటుందని చెప్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ చెప్పలేదు మేకర్స్. బాలయ్య పుట్టిన రోజు నాడు ఓ స్పెషల్ గ్లిమ్స్ తో టైటిల్ ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ప్రచారం ఉంది. ఇక ఈ టైటిల్ పై బాలయ్య అభిమానుల్లో ఉన్న సందేహం తాజాగా ఓ పోస్టర్ తో వీడింది.
సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. తాజాగా మైత్రి సంస్థ ఈస్ట్ గోదావరీ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ బాలయ్య స్టిల్ తో పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ మీద భగవత్ కేసరి అనే టైటిల్ కనిపించడంతో ఆఫీషియల్ గా టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది.
మైత్రి సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే ఆఫీషియల్ పోస్టర్ ఆఫీస్ లో పెట్టేశారు. అయితే ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సినిమాకు అనీల్ రావిపూడి ఈ టైటిల్ ఎందుకు పెట్టారన్నది త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ లీల కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:09 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…