ఈర్ష్య పడేలా చేస్తున్న నిఖిల్

ఒకపక్క కుర్ర హీరోలకు కథలు దొరక్క, ఒకవేళ దొరికినా వాటిని దర్శకులు సరిగా హ్యాండిల్ చేయలేక కిందా మీద పడుతున్న టైంలో నిఖిల్ లైనప్ అదిరిపోతోంది. ప్రతిదీ ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా విడుదల చేసిన స్వయంభు పోస్టర్ తో అంచనాలు షూటింగ్ మొదలుకాకుండానే పెరిగిపోయాయి. ఠాగూర్ మధు నిర్మాణంలో భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందబోయే ఈ పీరియాడిక్ డ్రామాకు కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చబోతున్నాడు. బడ్జెట్ కూడా ఆషామాషీగా ఉండబోవడం లేదు.

మొన్న రామ్ చరణ్ సమర్పణలో అనౌన్స్ చేసిన ది ఇండియా గేట్ మీద ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ మొదలయ్యింది. ఇప్పటికి సైలెంట్ గా ఉంది కానీ ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక జరగబోయే స్పై ప్రమోషన్స్ తో దానికి ఓ రేంజ్ మార్కెట్ హైప్ వచ్చేలా ఉంది. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం గురించి రూపొందించిన సినిమా కావడంతో నార్త్ బయ్యర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కార్తికేయ 2 లాగా లేట్ రిలీజ్ చేయకుండా మల్టీ లాంగ్వేజెస్ ఒకేసారి ప్లాన్ చేసుకోబోతున్నారు. రెండో వారం నుంచి అప్డేట్స్ మొదలవుతాయి

ఎలా చూసుకున్నా నిఖిల్ ప్లానింగ్ మాత్రం అదిరిపోతోంది. కిరాక్ పార్టీ తర్వాత కెరీర్ కాస్త నెమ్మదించినప్పటికీ సరైన టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. నెక్స్ట్ కార్తికేయ 3 ఎలాగూ ఉంది. టైం పట్టొచ్చు కానీ తెరకెక్కడం మాత్రం ఖాయమే. రొటీన్ లవ్ స్టోరీస్, మూసగా మారిపోయిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు దూరంగా, ఎమోషన్ల సాగతీత జోలికి వెళ్లకుండా సబ్జెక్టులను ఎంచుకుంటున్న నిఖిల్ ని చూస్తే భారతీయ చరిత్రలోని ఇతిహాస సంఘటనలు, వ్యక్తుల మీద తప్ప రెగ్యులర్ అయితే రావొద్దని చెప్పేలా ఉన్నాడు. ఏది ఏమైనా సెలక్షన్ మాత్రం సూపరని చెప్పక తప్పదు