ముందు నుంచి ప్రచారం జరిగినట్టే లీకైనట్టే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మూడు ముళ్ళు వేయడానికి ముందు ఈ నెల 9న నిశ్చితార్థం వేడుక జరపబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అయితే దీనికి రెండు కుటుంబాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు తప్ప ఇండస్ట్రీ నుంచి కానీ మీడియా నుంచి కానీ ఎవరిని పిలవడం లేదని వినికిడి. వివాహ తేదీ, వేదిక ఖరారు చేసుకున్నాక దానికి సంబందించిన వివరాలను బయట పెట్టబోతున్నారు. ఎంగేజ్ మెంట్ మాత్రం పూర్తిగా ప్రైవేట్ ఎఫైర్ తరహాలోనే జరగబోతోంది.
చిరంజీవి భోళా శంకర్ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. నాగబాబు ఎలాగూ అందుబాటులో ఉంటాడు. షూటింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు నగరంలోనే ఒక్క రోజు కేటాయించడం పెద్ద సమస్య కాదు. ఇక మిగిలిన కుటుంబ సభ్యుల సంగతి సరేసరి. హైదరాబాద్ లోనే జరగబోయే నిశ్చితార్థం ఎక్కడనేది ఇంకా తెలియలేదు. లావణ్య త్రిపాఠి స్వరాష్టం ఉత్తర్ ప్రదేశ్. ముంబైలో విద్యాభ్యాసం చేసింది. 2012లో అందాల రాక్షసితో డెబ్యూ చేసి తొలుత మంచి విజయాలు దక్కినా ఆ తర్వాత కెరీర్ స్లో అయిపోయింది
ఈ జంట కలయికలో మిస్టర్, అంతరిక్షం వచ్చాయి. కానీ రెండు డిజాస్టర్ కావడం ట్విస్ట్. సినిమాలు పోయినా రియల్ లైఫ్ లవ్ మాత్రం సూపర్ హిట్ అయిపోయి పెళ్లి పీఠల దాకా వెళ్లడం విశేషం. వరుణ్ చెల్లెలు నీహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారిన తరుణంలో ఇప్పుడు వరుణ్ పెళ్లి వ్యవహారాలు రిలీఫ్ ఇస్తాయి. గత అయిదేళ్ళుగా వరుణ్ లావణ్యలు ప్రేమలో ఉన్నారని ఫ్రెండ్స్ అంటుంటారు కానీ చాలా కాలం అది బయట పడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కథ ఇలా సుఖాంతం కాబోతోంది. అఫీషియల్ నోట్ రావాల్సి ఉంది
This post was last modified on June 1, 2023 3:49 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…