గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చాలా సందర్భాల్లో సూటిగానే మాట్లాడతారు. కాకపోతే వ్యక్తుల ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా అది ఎవరి గురించోననే హిట్ మాత్రం కరెక్ట్ గా ఇస్తారు. ఇవాళ జరిగిన 2018 సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందూ మొండేటితో తమ బ్యానర్ లో రెండు సినిమాలు వస్తాయని, కమిట్ మెంట్ ఇచ్చాడని, కొందరిలాగా మూలాలు మర్చిపోయి వెన్నుపోటు పొడిచే రకం కాదని దర్శకుడి మీద ప్రశంసలు గుప్పించారు. ఈ పంచు ఎవరి మీదో అర్థమయ్యిందిగా
కొన్ని నెలల క్రితం పరశురామ్ గీత ఆర్ట్స్ తో చేయాల్సిన విజయ్ దేవరకొండ సినిమాని హఠాత్తుగా దిల్ రాజు వైపు తిప్పేయడంతో అరవింద్ బాగా హర్ట్ అయ్యారు. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేయాలన్నది ఆయన ప్లాన్. కానీ ఇలా సడన్ ట్విస్టు రావడంతో ఎస్విసి అనౌన్స్ మెంట్ ఇచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని బహిర్గతం చేయాలనుకున్నారు. కానీ అందరూ సర్దిచెప్పడంతో వెనక్కు తగ్గారే తప్ప ఆ ఫీలింగ్ మాత్రం అలాగే మనసులో ఉండిపోయిందని సన్నితుల మాట. ఇదిగో ఇలా ఈ సందర్భంలో బయట పడ్డారు. ఇక్కడా డైరెక్ట్ గా పేర్ల ప్రస్తావన రాలేదు.
ప్రస్తుతం రామ్ తో చేస్తున్న మూవీ తర్వాత బోయపాటి శీను మళ్ళీ గీతా కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తారని అరవింద్ అన్నారు. సరైనోడు కలయికను రిపీట్ చేస్తూ అల్లు అర్జున్ తో సెట్ చేస్తారా లేక ఇంకో స్టార్ హీరోని తీసుకొస్తారా అనేది మాత్రం బయట పడలేదు. ఇండస్ట్రీలో ఇలా చేతులు మారిపోయే సినిమాల గురించి, మాట ఇచ్చి తప్పడాల గురించి ఎన్నో కథలు ఉన్నాయి కానీ అవి బహిర్గతమయ్యేది చాలా తక్కువ. ఇప్పుడు కూడా అరవింద్ నేమ్ చెప్పలేదు కానీ క్లియర్ గా హింట్ ఇచ్చారు. ఆ మధ్య నాగచైతన్య ఏకంగా పరుశురాం అని చెప్పి మరీ అసంతృప్తి వెలిబుచ్చాడు
This post was last modified on June 1, 2023 12:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…