Movie News

రిజల్ట్ పై నిర్మాతల పంచాయితీ ఎందుకో ?

సుమంత్ ప్రభాస్ హీరో కం డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ , లహరి ఫిల్మ్స్ నిర్మించిన ‘మేమ్ ఫేమస్’ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసి హైప్ క్రియేట్ చేసి రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అయితే ముందు నుండి ప్రమోషన్స్ లో టీం చెప్పినట్లు సినిమాకి సూపర్ హిట్ టాక్ రాలేదు. ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ నుండి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి రోజు కలెక్షన్స్ మీద గట్టి ఎఫెక్ట్ పడింది. అక్కడి నుండి సినిమా భారీ వసూళ్లు రాబట్టలేక మినిమం కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. వీకెండ్ వరకూ మూడు కోట్లు వచ్చాయని మేకర్స్ ప్రకటించారు. 

ఈ సినిమా రిజల్ట్ పై నిర్మాతలు సోమవారం పంచాయితీ పేరుతో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక నెగటివ్ బ్యాచ్ సినిమాను డ్యామేజ్ చేస్తుందని వాపోయారు. ముఖ్యంగా ట్విటర్ లో చూసి నచ్చిన వారి ఓపినియన్ పై డిస్కషన్ పెడుతూ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు. బుక్ మై షోలో పనిగట్టుకొని మరీ కావాలని తక్కువ రేటింగ్ ఇచ్చారని చెప్పుకున్నారు. తమ సినిమాను ట్రోల్ , రోస్టెడ్ చేస్తున్న వారితో డిబేట్ కి సిద్దమని అందుకే ఈ పంచాయితీ పెట్టామని అన్నారు. ఈ పంచాయితీ ప్రెస్ మీట్ దర్శకుడు హరీష్ శంకర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ లో స్కిప్ కొట్టారు.

ఇక మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ తో నిర్మాతలు అనురాగ్ , శరత్ అన్ హ్యాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. కొత్తవారితో తీసిన ఈ సినిమా ‘జాతిరతాలు’ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని భావించిన వారి ఆశలపై సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్ నీళ్ళు జల్లింది. ఇక సోషల్ మీడియాలో సెకండాఫ్ నచ్చలేదని కొందరు ప్రేక్షకకులు చెప్తున్నారు. కానీ దాన్ని పట్టించుకోకుండా మేకర్స్ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై స్పీచులతో పంచాయితీ పెట్టుకున్నారు. ఛాయ్ బిస్కెట్ సంస్థ డిజిటల్ మీడియా నుండి సినిమా నిర్మాణం వైపు వచ్చింది. సోషల్ మీడియాలో జనాల సంగతి వారికి తెలియనిది కాదు. మరి నెగెటివ్ కామెంట్స్ పై ఈ పంచాయితీ ఎందుకో వారికే తెలియాలి. సినిమాలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సాదిస్తాయని దాన్ని ఎవరూ ఆపలేరని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. బలగం దీనికి ఓ చక్కని ఉదహాహారణ.

This post was last modified on May 29, 2023 11:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

37 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

56 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago