Movie News

అంజి మామని మెచ్చుకున్న జక్కన్న

విడుదలకు ముందు మహేష్ బాబు పొగిడిన మేం ఫేమస్ ఇప్పుడు దర్శక ధీర రాజమౌళి ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య ట్విట్టర్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న జక్కన్న తాజాగా ఈ సినిమాను ప్రశంసిస్తూ హీరో దర్శకుడు సుమంత్ కు మంచి భవిష్యత్తు ఉందని నటీనటులందరూ బాగా చేశారని ఫ్రెండ్స్ గ్యాంగ్ కు దిక్సూచిగా నటించిన అంజి మామకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇవాళ్టి నుంచి కలెక్షన్లు డ్రాప్ అవుతున్న ట్రెండ్ లో నిజంగా ఇది చాలా బూస్ట్ ఇచ్చే విషయం. మహేష్ బాబు ట్వీట్ మీద ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన టైంలో జక్కన్న స్పందించడం విశేషం

మూడు రోజులకు గాను మూడు కోట్లను దాటేసిన మేం ఫేమస్ ఇంకా జోరు చూపించాల్సి ఉంది. టీమ్ మాత్రం ప్రమోషన్లు ఆపడం లేదు. మొన్న గోకుల్ థియేటర్ లో స్టూడెంట్స్ కి ఫ్రీ షో వేశారు. నిన్నంతా హైదరాబాద్ కలియతిరిగి వివిధ మల్టీప్లెక్సుల్లో ఆడియన్స్ ని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆడియన్స్ రియాక్షన్లను వీడియో రూపంలో రికార్డు చేసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారు. సక్సెస్ మీట్ తో పాటు మీడియాను కలుసుకోవడం ఇత్యాది అన్నీ జరిగిపోతున్నాయి. పోటీగా వచ్చిన వాటిలో 2018 ఒకటే స్ట్రాంగ్ గా ఉండగా మళ్ళీ పెళ్లిని జనాలు పట్టించుకోవడం లేదు.

సో మేం ఫేమస్ ఈ అవకాశాన్ని వాడుకోవడానికి చూస్తోంది. ఈ వారం వచ్చే కొత్త రిలీజుల్లో నేను స్టూడెంట్ సర్, అహింసలు ప్రధానంగా ఉన్నాయి. వీటి మీద ఏమంత బజ్ లేదు. పబ్లిక్ టాక్ మీదే ఆధారపడ్డాయి. అప్పటిదాకా ఇంకో నాలుగు రోజుల టైం ఉంది కాబట్టి మేం ఫేమస్ వీలైనంత రాబట్టుకోవాలి. వీకెండ్ ఎలాగూ పికప్ ఉంటుంది కనక ఇబ్బంది లేదు. ఒకవేళ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే మేం ఫేమస్ బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ని భారీ కలెక్షన్ల రూపంలో  మార్చుకునేది. జాతిరత్నాలు రేంజ్ లో రెస్పాన్స్ ఊహించింది కానీ క్రమంగా డివైడ్ టాక్ ఫుల్ పాజిటివ్ గా మారుతుందేమో చూడాలి 

This post was last modified on May 29, 2023 8:38 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

28 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago