Movie News

చేతులు మారిన ప్ర‌భాస్ కొత్త సినిమా

ప్ర‌భాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం అయితే ఆ త‌ర్వాత మ‌రో మూడు నెల‌ల‌కే ‘స‌లార్’.. ఇంకో నాలుగు నెల‌ల‌కే ‘ప్రాజెక్ట్ కే’ కూడా రిలీజైపోతాయి. ఆ త‌ర్వాత మరి కొన్ని నెల‌ల‌కే మారుతి సినిమా కూడా వ‌చ్చేస్తుంది. ఈ ఏడాది చివ‌ర్లోపు చేతిలో ఉన్న సినిమాల‌న్నింటినీ పూర్తి చేసే ప్ర‌ణాళిక‌లో ఉన్నాడు ప్ర‌భాస్.

ఇవన్నీ అయ్యాక ప్రభాస్ చేయాల్సిన సినిమా.. స్పిరిట్. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ పేరుతో ప్రభాస్ చాన్నాళ్ల క్రితమే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టీ సిరీస్ వాళ్లు.. ప్రభాస్ హోం బేనర్ అనదగ్గ యువి క్రియేషన్స్‌తో కలిసి భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఐతే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కీలక మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం.

యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారన్నది తాజా కబురు. ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా చేస్తున్న పీపుల్స్ మీడియా అధినేతలు.. టీ సిరీస్ వాళ్లతో చేతులు కలుపుతున్నారట. విశేషం ఏంటంటే.. ‘ఆదిపురుష్’ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స మీడియా వాళ్లు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్న తరుణంలోనే ‘స్పిరిట్’ కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

అంటే ప్రభాస్ మీద వాళ్లకు బాగా గురి కుదిరి.. అతడితో అనుబంధం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ‘యువి’ వాళ్లను పక్కన పెట్టి మరీ పీపుల్స్ మీడియా వాళ్లకు మరో సినిమా చేయడానికి ప్రభాస్ సిద్ధం కావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం ‘యానిమల్’ పనిలో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి.. ఈ ఏడాది చివర్లో ప్రభాస్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టనున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.

This post was last modified on May 29, 2023 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago