మతి పోగొడుతున్న ఆదిపురుష్ బిజినెస్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ బిజినెస్ హాట్ కేక్ కన్నా వేడిగా మారిపోయింది. ట్రైలర్ రాక ముందు వరకు ఎన్నో అనుమానాలు, నెగిటివిటీని తట్టుకున్న ఈ రామాయణ గాధ కోసం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నువ్వా నేనాని తలపడుతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 160 నుంచి 170 కోట్ల మధ్యలో థియేట్రికల్ డీల్స్ పూర్తవ్వబోతన్నాయని ఇన్ సైడ్ టాక్. తొలుత యూవీ సంస్థనే పంపిణి చేయాలని పోటీ పడినప్పటికీ సాహో, రాధే శ్యామ్ తాలూకు సెటిల్మెంట్లు ఇంకా పెండింగ్ ఉండటంతో డిస్ట్రిబ్యూషన్  వద్దనుకున్నట్టు వినికిడి

దాని స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసి భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఒప్పందం కూడా ముగిసిందట. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. పైగా జైశ్రీరామ్ సాంగ్ లాంచ్ తర్వాత హైప్ కి పట్టపగ్గాలు ఉండవని, ఇండియన్ హిస్టరీలో బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఎలాగూ దేశవ్యాప్తంగా గత రెండు మూడు నెలలుగా అన్ని వర్గాలను థియేటర్లకు రప్పించిన సినిమా ఒక్కటీ లేదు. ఆ లోటుని ఆదిపురుష్ సంపూర్ణంగా తీరుస్తుందనే ధీమా టి సిరీస్ లో కనిపిస్తోంది

ఇక నుంచి ప్రతిరోజు ఆదిపురుష్ కు సంబంధించిన టాపిక్స్ తో మూవీ లవర్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు రకరకాల సమీకరణాల్లో బిజీ కాబోతున్నారు. జూన్ 16 దాదాపు ఎనభై శాతం పైగా థియేటర్లలో ఈ ఒక్క సినిమానే వేసినా ఆశ్చర్యం లేదు. మరోవైపు మల్టీప్లెక్సులు ఆడియన్స్ ని భారీ సంఖ్యలో రప్పించడంలో ఆఫర్లు ప్లాన్ చేస్తున్నాయి. ఫ్యామిలీస్ కి డిస్కౌంట్ రేట్లతో కాంబోస్ సిద్ధం అవుతున్నాయి. ఒకవేళ టాక్ కనక చాలా బాగుందని వస్తే మాత్రం ఇక్కడేమో కానీ నార్త్ ఇండియాలో మాత్రం రికార్డులకు ఉప్పు పాతర పడటం ఖాయం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోంది కూడా ఇదే