సీనియర్ దర్శకుడు తేజకు టాలీవుడ్లో మరే దర్శకుడికీ లేని స్పెషాలిటీ ఉంది. ఆయన కొత్త టాలెంట్‌ను వెతికి వెతికి పట్టుకుంటారు. తన ప్రతి సినిమాతోనూ బోలెడంతమంది నటీనటులతో పాటు టెక్నీషియన్లను ఆయన వెండితెరకు పరిచయం చేస్తుంటారు. రెండు దశాబ్దాల కెరీర్లో ఆయన పరిచయం చేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సంఖ్య వెయ్యికి పైనేనట. ఈ విషయాన్ని తన కొత్త చిత్రం ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘అహింస’ సినిమాతోనూ హీరో హీరోయిన్లు అభిరామ్ దగ్గుబాటి, గీతికలతో పాటు పలువురిని పరిచయం చేస్తున్నారు తేజ. ఇదిలా ఉంటే.. షకీలా అనే సాఫ్ట్ పోర్న్ మలయాళ సినిమాలు చేసుకునే నటిని సైతం రెగ్యులర్ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తేజకే చెందుతుంది. అలాంటి నేపథ్యం ఉన్న నటిని తాను ‘జయం’ సినిమాలోకి ఎలా తీసుకున్నానో తేజ ‘అహింస’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు.
“జయం సినిమా మొదలవడానికి ముందు నేను, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మరొకరు కలిసి హైదరాబాద్‌లో కార్లో వెళ్తున్నాం. అలా వెళ్తుండగా.. తారకరామ థియేటర్ దగ్గర పెద్ద జన సందోహం కనిపించింది. కుర్రాళ్లు థియేటర్ గేట్లు ఓపెన్ చేయగానే తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతగా ఉత్సాహం చూపిస్తున్నారు ఏం సినిమా అబ్బా ఇది అని చూస్తే.. ‘కామేశ్వరి’ సినిమా పోస్టర్ కనిపించింది.
ఇది ఎవరి సినిమా అని అడిగితే.. షకీలా గురించి చెప్పారు. ఎందుకు ఈమెకు ఇంత క్రేజ్ అనుకుని నేను థియేటర్లోకి వెళ్లి మేనేజర్‌కు చెప్పి మాక్కూడా మూడు టికెట్లు ఇవ్వమన్నా. మీరు ఇలాంటి సినిమా చూడ్డం ఏంటి అని అతను ఆశ్చర్యపోయాడు. కానీ టికెట్లివ్వమని లోపలికి వెళ్లా. అక్కడ చూస్తే షకీలా కనిపించగానే కుర్రాళ్లు హారతులు పడుతున్నారు. ఆ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. తెర మీద ఆమెను చూశాక.. ఈమే నా సినిమాలో లెక్చరర్ అని ఫిక్సయిపోయా. నేను నటీనటులను ఎంచుకునే విధానం ఇలా ఉంటుంది” అని తేజ తెలిపారు.
This post was last modified on May 28, 2023 1:42 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…