మహా రచయిత కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ను చరిత్రలో ఒక మహా ప్రేమ కావ్యంగా చెబుతారు. దుష్యంత మహారాజు.. శంకుతలల ప్రేమకథను తరాల నుంచి కథలు కథలుగా వింటూ వస్తున్న వాళ్లందరూ దాన్ని కొనియాడుతూనే ఉన్నారు. మన దగ్గర పౌరాణికాలు, జానపదాలు తెరకెక్కుతున్న సమయంలో దీని మీద సినిమాలు వచ్చాయి. వేరే చిత్రాల్లో దీన్ని ఒక ఎపిసోడ్ లాగా చూపించారు.
ఐతే ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకుని.. ఈ తరం ప్రేక్షకులకు ఆ ప్రేమకథను అందించాలని సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నించాడు. ఆయన సొంతంగా డబ్బులు పెట్టి ఈ సినిమా తీస్తే.. అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తోడ్పాటు అందించార. వీళ్లిద్దరూ కలిసి భారీ బడ్జెట్లో ఈ సినిమా తీస్తే ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. వీకెండ్లో కూడా సినిమా సరిగా ఆడలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఐతే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయాలని సాహసించిన దర్శకుడు గుణశేఖర్‌ను అభినందిస్తూనే… ఈ సినిమా విషయంలో ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.తన పరుచూరి పలుకులు యూట్యూబ్ ఛానెల్లో ఆయన ‘శాకుంతలం’ సినిమా మీద విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథను గుణశేఖర్ బాగా రాసుకోవడంతో పాటు ప్రథమార్ధం వరకు చక్కగానే తీశాడని ఆయనన్నారు. కానీ సెకండాఫ్ తేడా కొట్టిందని.. అందుకే వసూళ్లు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా దుష్యంతుడు తిరస్కరించాక శంకుతలను ప్రజలు రాళ్లతో కొట్టినట్లు చూపించడం తప్పన్నారు పరుచూరి. ‘శాకుంతలం’ కథకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ఏ వెర్షన్లోనూ ఇలా జరిగినట్లు లేదన్నారు. మహిళా ప్రేక్షకుల్లో సెంటిమెంట్ లేపడానికి గుణశేఖర్ ఇలా చేసి ఉండొచ్చు కానీ.. అది మాత్రం తప్పని ఆయనన్నారు. సమంత సహా నటీనటులందరూ ఇందులో చాలా బాగా చేశారని ఆయన కితాబిచ్చారు.
‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ తీయాలని గుణశేఖర్ అనుకుంటే.. అది సాధ్యపడలేదని.. ఆ తర్వాత ఆయన సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఒక సోషల్ కథ తీసి ఉండొచ్చని.. కానీ సొంతంగా డబ్బు పెట్టుకుని ‘శాకుంతలం’ లాంటి పెద్ద సినిమా చేయాలనుకున్నారని.. అది ఆయన ఎంత వైవిధ్యంగా, సాహసోపేతంగా ఆలోచిస్తారో చెప్పడానికి నిదర్శనమని.. ఇలాంటి దర్శకుడికి ప్రతికూల ఫలితం రావడం బాధాకరమని పరుచూరి అన్నారు.
This post was last modified on May 27, 2023 11:44 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…