ఈ మధ్య సినిమాల ప్రమోషన్లు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. మొదటి రోజు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం ఎవరెస్ట్ ఎక్కడం కన్నా కష్టమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేరోజు చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మేం ఫేమస్ ని ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్లు వేస్తున్నారు. అది కూడా 99 రూపాయలకే. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఆ షోలకు బుకింగ్స్ వేగంగా ఉన్నాయి.
వాటి నుంచి వచ్చే టాక్ తర్వాతి రోజు నుంచి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెస్తుందని నిర్మాతలు చూస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ కు ఇలాగే వర్కౌట్ అయ్యింది. ఇక నరేష్ పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లికి ఈవెంట్లు ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయాయి. కొన్ని వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. రిటైర్మెంట్ వయసులో ఉన్న హీరోకు ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశే కానీ ఇది నరేష్ నాలుగో పెళ్లికి సంబంధించిన రియల్ బయోపిక్ లాంటి కథ కావడంతో జనాల ఆసక్తి బాగానే ఉంది.
అయితే ఇది టికెట్లు కొనే స్థాయిలో ఉందా లేదానేది రేపు సాయంత్రానికి తేలిపోతుంది. అడ్వాన్స్ సేల్స్ మాత్రం నత్తనడకన ఉన్నాయి. మలయాళం బ్లాక్ బస్టర్ 2018 కి సైతం బయట పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. సెలబ్రిటీ షోకు రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. మైత్రి సమర్పిస్తున్న మీటూ సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడుతోంది. చూసే కొద్దిమంది చాలా బాగుందనే మాట స్ప్రెడ్ చేస్తే పికప్ ఆశించవచ్చు.
పైగా ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేదు. అందరూ టాలెంట్ ఉన్న యాక్టర్లే. అమ్మాయిలు భార్యల బాధితుల చుట్టూ నడిపించిన కథ కాబట్టి ఎంటర్ టైన్మెంటే పబ్లిక్ ని లాక్కురావాలి. ఇవి కాకుండా చితక సినిమాలు మరికొన్ని ఉన్నాయి కానీ ప్రధానంగా హైలైట్ అవుతున్నది ఈ నాలుగే. బాక్సాఫీస్ బాగా డల్లుగా ఉన్న టైంలో ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే మంచి కలెక్షన్లు రాబట్టుకోవచ్చు. మరి విజేత ఎవరవుతారో.
This post was last modified on May 25, 2023 11:47 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…