అనుకున్నట్టుగానే జియో ఓటిటి రంగంలో తనదైన ముద్ర వేయడానికి పెద్ద ప్లానే వేసుకుంటోంది. ఇప్పటిదాకా ఫోర్ జి విప్లవంతో సామాన్యుల జీవితాల్లోనూ ఇంటర్ నెట్ ఒక అంతర్భాగం చేసిన ఈ సంస్థ ఇప్పుడు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ ని గుప్పిట్లో పెట్టుకునే స్ట్రాటజీతో థియేటర్ వ్యవస్థకు సవాల్ విసిరే కంటెంట్ ని ఉచితంగా పంచేందుకు నిర్ణయించుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన బ్లడీ డాడీ వచ్చే నెల 9న జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది చూడాలంటే లాగిన్ కూడా అవసరం లేదు. కేవలం యాప్ ఇన్స్ టాల్ చేసుకుంటే చాలు
బ్లడీ డాడీ ట్రైలర్ ఇందాక రిలీజ్ చేశారు. ఒక రాత్రి విలన్ గ్యాంగ్ కు చెందిన కొకైన్ బ్యాగ్ నార్కోటిక్ ఆఫీసరైన హీరోకు దొరుకుతుంది. అది తెచ్చివ్వకపోతే నీకు ప్రాణమైనది శాశ్వతంగా దూరమవుతుందని విలన్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో పోగొట్టుకున్న సొత్తుని తీసుకొచ్చిన అతను రివర్స్ లో ఆ మత్తు పదార్థం బదులు గోధుమ పిండి పెట్టి ఏమరుస్తాడు. వెంటపడిన ముఠాను ఒక్కొక్కరిగా నరికేస్తూ రక్తపాతం సృష్టిస్తాడు. అసలు ఈ ఊబిలోకి ఎలా వచ్చాడు, ఎలా బయట పడ్డాడు, ఊచకోతకు ఎందుకు తెగబడ్డాడు లాంటి ప్రశ్నలకు సమాధానం పూర్తి మూవీ చూస్తే కానీ అర్థం కాదు
మంచి విజువల్స్, ఖరీదయిన ప్రొడక్షన్, జాన్ విక్ రేంజ్ లో వయొలెంట్ యాక్షన్ ఇవన్నీ పుష్కలంగా దట్టించారు. దర్శకుడు ఆషామాషీ బ్యాచ్ కాదు. సల్మాన్ ఖాన్ కి టైగర్ జిందా హై, సుల్తాన్, భారత్ లతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఈ బ్లడీ డాడీ హాలీవుడ్ స్లీప్ లెస్ నైట్ కి రీమేక్. నిజానికి దీన్ని కమల్ హాసన్ ఎప్పుడో చీకటి రాజ్యంగా ఫ్రీ మేక్ చేశారు కానీ పెద్దగా ఆడలేదు. అయితే ప్రొడక్షన్ స్కేల్, టెక్నికల్ వాల్యూస్ పరంగా బ్లడీ డాడీ రిచ్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ డల్ ఉన్న టైంలో ఇలాంటి క్రేజీ కంటెంట్ ఉన్నవి కూడా ఓటిటి బాట పడితే ఎలానేది ఫ్యాన్స్ ప్రశ్న