పవర్ స్టార్ అభిమానులు యునానిమస్ గా చెప్పుకునే కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ. విడుదలైన పాతికేళ్ళవుతున్నా అందులో ఫ్రెష్ నెస్ ఇప్పటి జనరేషన్ కి సైతం కనెక్ట్ అవుతుంది. కేవలం హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ గట్రా లేకుండా స్వచ్ఛమైన స్నేహం, కుర్రాళ్లలో అమాయకత్వంతో పాటు అన్నా చెల్లెలి బంధం గురించి దర్శకుడు కరుణాకరన్ ఆవిష్కరించిన తీరు అతన్నే మళ్ళీ దాన్ని మించిన సినిమా తీయనివ్వలేదు. సంగీత దర్శకుడు దేవా ఇచ్చిన పాటల గురించి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. అలంటి బ్లాక్ బస్టర్ కి ఇప్పుడు రీరిలీజ్ పంచాయితీలోకి రానుంది.
జూన్ 30న తొలిప్రేమను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటికే ఆడియన్స్ ఇలాంటి మళ్ళీ విడుదల వ్యవహారాల పట్ల విసుగెత్తిపోయి ఉన్నారు. ఖుషి, తమ్ముడు బాగా ఆడాయి. త్వరలో జనసేన నిధుల కోసం గుడుంబా శంకర్ ని ఎలాగూ ప్లాన్ చేశారు. ఇంత తక్కువ గ్యాప్ లో తొలిప్రేమని తీసుకొస్తే ఆ మేజిక్ ని ఫీల్ అయ్యేందుకు స్వంత ఫ్యాన్సే అంతగా ఇష్టపడకపోవచ్చు. చూసేవాళ్ళు చూస్తారు లేదంటే లేదనే లాజిక్ ఇక్కడ పని చేయదు. ఎందుకో ట్విట్టర్ గొడవలు చూస్తే అర్థమవుతుంది.
కేవలం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడం తప్పించి ఇలా నెలకు రెండు మూడు రీ రిలీజులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మూవీ లవర్స్ వాపోతున్నారు. పైగా టికెట్ ధరల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా రెగ్యులర్ రేట్లు పెట్టేసి మంచి మంచి క్లాసిక్స్ ని ఇలా వృధా చేయడం ద్వారా ఏం ఒరుగుతుందని బాధ పడుతున్నారు. ఇందులో నిజముంది. రెండు వారాలకు ఒకటి జేబులకు చిల్లులు పెట్టుకుంటూ ఫ్రీగా దొరికే వాటిని అంతంత డబ్బులేసి జనం చూడరుగా. అలాంటప్పుడు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించి ప్లాన్ చేసుకుంటే బాగుండేది. పైగా జూలైలో యానివర్సరీ పెట్టుకుని జూన్ లో చేయడమేంటో.
This post was last modified on May 24, 2023 3:05 pm
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.…
హైదరాబాద్ వాసులకు.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం 2025 సందర్భంగా శుభాకాంక్షలతో పాటు కానుకను కూడా అందించారు. హైదరాబాద్…
సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు…
తెలుగు సినీ పరిశ్రమను అమరావతి రాజధానికి తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తయితే.. అన్ని రంగాల…
ఏపీ సీఎం చంద్రబాబు.. 2025 నూతన సంవత్సరం తొలిరోజు చాలా చాలా బిజీగా గడిపారు. అయితే.. సహజంగానే తొలి సంవత్స…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభానికి జనవరి 2 ఎంచుకోవడం హాట్ టాపిక్…