చైతు నష్టపోయినా కృతి లాభపడింది

ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ డిజాస్టర్ కావడం వల్ల బాగా నష్టపోయింది నిర్మాత కన్నా ఎక్కువ నాగ చైతన్యనే. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో దీని మీద చాలా నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఖచ్చితంగా ఇదో పాత్ బ్రేకింగ్ మూవీగా నిలుస్తుందని నమ్మాడు. కానీ దర్శకుడు వెంకట్ ప్రభు ఆయుధమైన స్క్రీన్ ప్లే ఇందులో బలహీనతగా మారడంతో కనీసం ఫ్యాన్స్ ని మెప్పించడంలోనూ కస్టడీ విఫలమయ్యింది. థాంక్ యు, లాల్ సింగ్ చద్దాల తర్వాత ఇలాంటి ఫలితం రాకుండా ఉంటే బాగుండేది. దీనికి పనిచేసిన ఇంకెవ్వరికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు

ఎందుకంటే వెంకట్ ప్రభు చేతికి విజయ్ కొత్త సినిమా వచ్చింది. యువన్ శంకర్ రాజాకే సంగీత బాధ్యతలు అప్పజెప్పారు. హీరోయిన్లు ఇద్దరు ఉంటారట. అందులో ఒకరిగా కృతి శెట్టినే తీసుకునే విధంగా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారట. అసలే వరస ఫ్లాపులతో ఉన్న కృతికి అర్జెంట్ గా బ్రేక్ అవసరం. అది విజయ్ లాంటి స్టార్ హీరో చిత్రంలో చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే యమా సంతోషంగా ఉందట. కస్టడీ టైంలో ఆమె పెర్ఫార్మన్స్ నచ్చిన వెంకట్ ప్రభు స్వయంగా రికమండ్ చేయడంతో విజయ్ నో చెప్పడానికి కారణం ఎక్కడ ఉంటుంది.

క్యాస్టింగ్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాలేదు కానీ ప్రాజెక్ట్ ప్రకటన అధికారికంగా వచ్చేసిన సంగతి తెలిసిందే. అయినా వెంకట్ ప్రభుని గుడ్డిగా నమ్మినందుకు దక్కిన రిజల్ట్ ఇది. మలయాళంలో టోవినో థామస్ తో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న కృతి శెట్టికి ఇప్పుడు తమిళంలో ఇలాంటి ఆఫర్ రావడం అంటే డబుల్ జాక్ పాటే. ఒకేసారి మల్లువుడ్ కోలీవుడ్ ఎంట్రీ జరిగిపోతుంది. ఒక ఫ్లాప్ వల్ల అందులో పని చేసినవాళ్లకు ప్రయోజనం కలగడం అరుదు. వీళ్ళ సంగతేమో కానీ చైతు మాత్రం నెక్స్ట్ శివ నిర్వాణ, చందూ మొండేటిలతో చేయడం దాదాపు కన్ఫర్మే.