జూన్ 16 ఎంతో దూరంలో లేదు. ఇంకో ఇరవై రోజులు కౌంట్ డౌన్ అయిపోతే థియేటర్లలో జై శ్రీరామ్ నినాదాలు వినొచ్చు. గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివిటీని ట్రైలర్ తో పాటు లిరికల్ వీడియోలు దాదాపుగా తగ్గించేశాయి. జనాల్లో మెల్లగా క్రేజ్ పెరుగుతోంది. వేసవిలో కుటుంబం మొత్తం చూసే యునానిమాస్ సినిమా ఏదీ రాకపోవడంతో ఓపెనింగ్స్ మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏకంగా బాహుబలిని టార్గెట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే నిర్మాణ సంస్థ టి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్క్రీన్ కౌంట్ తో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ అదే రోజు ఓవర్సీస్ లో ప్రభాస్ రాముడికి చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ సేమ్ డేట్ బరిలో దిగుతోంది. సూపర్ హీరో జానర్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బ్యాట్ మ్యాన్ కూడా ఉండటంతో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా ఎదురు చూస్తున్నారు. డిసి సంస్థ కాబట్టి సహజంగానే యుఎస్, యుకె లాంటి దేశాల్లో భారీగా రిలీజ్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు ఆదిపురుష్ తక్కువ స్క్రీన్లతో సర్దుకోవాల్సి రావొచ్చు. ఇది ముందే పసిగట్టిన టి సిరీస్ బయ్యర్లు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు.
ఫ్లాష్ ని ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇవాళ వచ్చిన ట్రైలర్ చూస్తే విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ డే థియేటర్ కు వెళ్ళాల్సిందేనంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది కూడా త్రీడితో వస్తోంది. మరి ఫ్లాష్ ని తట్టుకుని ఆదిపురుష్ నెగ్గాలంటే మాత్రం ఎక్స్ ట్రాడినరిగా ఉందనే మాట రప్పించుకోవాలి. ఇండియాలో ఈ సమస్య అంతగా ఉండదు. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ కు ఫ్లాష్ అడ్డంకి కాదు. సరిపడా థియేటర్లు సులభంగా దొరుకుతాయి. ఎలాగూ పోటీ లేదు. రికార్డులు ఏ స్థాయిలో నమోదవుతాయో చూడాలి.
This post was last modified on May 24, 2023 11:43 am
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…