Movie News

డైరెక్ట్ OTTలో విశ్వక్ సేన్ సినిమా

హిట్టు ఫ్లాపు పక్కనపెడితే విశ్వక్ సేన్ కు తెలుగులో డీసెంట్ మార్కెటే ఉంది. దాస్ కా ధమ్కీ అంచనాలు అందుకోలేకపోయినా థియేట్రికల్ గా ఓ మోస్తరుగా వర్కౌట్ అయ్యింది. హీరో చూపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ రేంజ్ లో కాదు కానీ కథను సరిగా డీల్ చేసి ఉంటే మంచి విజయం దక్కేది. ఇప్పటిదాకా విశ్వక్ ఏ సినిమా డైరెక్ట్ ఓటిటిలో రాలేదు. అన్నీ నేరుగా హాళ్లలోకి వచ్చినవే. మొదటి ఒక మూవీ డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఎప్పుడో కాదండోయ్ ఈ మే 27 శనివారమే స్ట్రీమింగ్ ఉంటుంది.

ఇటీవలే దూకుడు పెంచిన జియో సినిమా యాప్ లో రాబోతున్న ఈ చిత్రం పేరు భూ. హారర్ జానర్ లో రూపొందింది. దర్శకుడు విజయ్. ఎప్పుడు షూటింగ్ చేశారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవరికి తెలియదు. విశ్వక్ సేన్ ది కేవలం క్యామియోనా లేక ఫుల్ లెన్త్ రోలా అనేది కూడా నేరుగా విడుదల రోజే తెలుసుకోవాలి కాబోలు. ఇందులో గ్లామర్ అట్రాక్షన్ చాలా ఉంది. రకుల్ తో పాటు మేఘ ఆకాష్, నివేత పేతురాజ్, మంజిమా మోహన్, విద్యుత్ రామన్ ఇతర పాత్రలు పోషించారు. ఇదో దెయ్యాల కథల సమాహారం. అయిదుగురు అమ్మాయిలకు ఎదురైన అనుభవాలను చూపించబోతున్నారు

ఇంత క్యాస్టింగ్ ఉండి కూడా దీని గురించి కనీసం మీడియాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ విశ్వక్ సేన్ ఇలాంటి హారర్ మూవీలో భాగం కావడం అనూహ్యం. నిజంగా అంత స్పెషల్ ఏముందో బొమ్మ చూస్తే కానీ అర్థం కాదు. అందులోనూ చాలా తక్కువ గ్యాప్ లో కేవలం మూడు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం విచిత్రంగా ఉంది. హిందీ సినిమాలే కాదు సౌత్ మీద కూడా జియో కన్ను గట్టిగా కనిపిస్తోంది. చాలా కంటెంట్ ని ఎలాంటి చందా కట్టకుండానే ఫ్రీగా అందిస్తోంది. హెచ్బిఓ సరుకు కావాలంటే మాత్రం జియోకు డబ్బులు చెల్లించాలి

This post was last modified on May 23, 2023 4:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ చేస్తోంది లోకేష్ డ్రీమ్ ప్రాజెక్టా ?

అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…

2 hours ago

ఆర్కే ఏమ‌య్యారు… వైసీపీలో హాట్ టాపిక్ ..?

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌గానే ఠ‌క్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వ‌స్తున్నారు. నియోజ‌క వర్గంలో చేప‌డుతున్న ప‌నులు కావొచ్చు..…

4 hours ago

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…

4 hours ago

బన్నీతో లోకీ – అడవిలో అరాచకం ?

గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…

6 hours ago

షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్

చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…

6 hours ago

అన్నగారు తప్పుకోవడమే మంచిదయ్యింది

తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…

7 hours ago