కొందరు దర్శకులకు ఎక్కడో సుడి ఉంటుంది. ఒక హీరోతో ఏర్పడిన బంధం వల్లనో లేదా తీసిన సినిమాలతో వచ్చిన పేరు వల్లనో హఠాత్తుగా జాతకం మారిపోతుంది. శాండల్ వుడ్ డైరెక్టర్ ఏ హర్షని చూస్తే అదే అనిపిస్తోంది. ఇతనే ఇటీవలే వచ్చిన శివరాజ్ కుమార్ వేద తీసింది. తెలుగులో అదే రోజు ఓటిటి రిలీజ్ చేయడం వల్ల పోయింది కానీ కన్నడలో కమర్షియల్ గా బాగానే ఆడింది. ఇంతకు ముందు తీసిన భజరంగి కర్ణాటకలో బ్లాక్ బస్టర్. సీక్వెల్ వచ్చింది కానీ పెద్దగా ఆడలేదు. రారండోయ్ వేడుక చూద్దాం రీమేక్ ని నిఖిల్ కుమార్ గౌడతో తీసి హిట్టు కొట్టారు.
ఇప్పటిదాకా పదిహేనేళ్ల కాలంలో తీసింది పది సినిమాలే. తాజాగా ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టు బెంగళూర్ టాక్. అది కూడా ఆషామాషీ కాంబినేషన్ కాదండోయ్. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో శివరాజ్ కుమార్ తాను బాలయ్య కలిసి ఒక మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు కదా అది హర్షతోనేనట. ఇది మొత్తం మూడు భాగాలుగా ఉంటుందని బాలకృష్ణ రెండో భాగంలో ఫుల్ లెన్త్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు టాక్. థర్డ్ పార్ట్ లో మరో సీనియర్ స్టార్ హీరో వస్తారట.
ఇది పీరియాడిక్ డ్రామాగా రూపొందవచ్చని వినికిడి. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న దృష్ట్యా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. బాలయ్య శివరాజ్ కుమార్ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో ఘాడమైన సాన్నిహిత్యం ఉంది. గౌతమిపుత్రశాతకర్ణిలో చిన్న పాత్ర వేసేందుకు కన్నడ స్టార్ ఒప్పుకున్నది ఇందుకే. కార్యరూపం దాలిస్తే మాత్రం హర్ష నక్క తోక తొక్కినట్టే. ఎందుకంటే ఈ మూడు పూర్తయ్యేలోగా ఎలాగూ నాలుగైదేళ్ళకు సరిపడా పని దొరికేస్తుంది. హిట్ కొట్టాడా జాతకం మారిపోయి ప్రశాంత్ నీల్ లా డిమాండ్ పెంచుకోవచ్చు
This post was last modified on May 23, 2023 12:22 pm
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…