ప్రేక్షకులు ఊహించని ఓ కాంబో భారీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారంటే ? మూవీ లవర్స్ కి అంతకంటే సంతోషముండదు. తాజాగా అలాంటి ఓ వార్తే సినిమా అభిమానులను సంబరపెడుతూ ఇది సాధ్యమేనా ? అనిపించేలా చేస్తుంది. విషయంలోకి వెళితే బాలకృష్ణ – శివరాజ్ కుమార్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. శివ రాజ్ కుమార్ ప్రొడక్షన్ లో కన్నడ దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని, దీన్ని రెండు భాగాలుగా తీస్తారని టాక్ వినిపిస్తుంది. మొదటి పార్ట్ లో బాలకృష్ణ -శివ రాజ్ కుమార్ ఉంటారట , రెండో పార్ట్ లో మాత్రం రజినీ కాంత్, బాలయ్య కనిపిస్తారని అంటున్నారు.
తాజాగా శివ రాజ్ కుమార్ బాలయ్య తో మా కాంబోలో సినిమా రానున్నట్లు తెలియజేశాడు. దీంతో ఈ కాంబో సినిమా ఫిక్స్ అని క్లారిటీ వచ్చేసింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో ఎన్టీఆర్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. ముఖ్యంగా బాలయ్య -శివ రాజ్ కుమార్ ఇద్దరు మంచి మిత్రులు. గతంలో బాలయ్య అడగ్గానే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా శివ రాజ్ కుమార్ హాజరయ్యాడు.
బాలయ్య , శివ రాజ్ కుమార్ కాంబో అయితే ఫిక్సే. కానీ రజినీ కాంత్ , బాలయ్య కాంబో మీద అందరికీ డౌట్స్ కలుగుతున్నాయి. ప్రస్తుతం రజినీ కాంత్ జైలర్ , లాల్ సలాం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘జై భీం’ ఫేమ్ జ్ఞానవేల్ తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ తో మరో ప్రాజెక్ట్ లైనప్ లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ లో రజినీ ఈ సినిమాకు డేట్స్ ఇస్తారా ? కష్టమే అనిపిస్తుంది. ఒక వేళ రజినీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ కాంబో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడమే కాదు సెన్సేషన్ అవుతుంది కూడా.
This post was last modified on May 25, 2023 6:03 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…