ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లి ప్రమోషన్ కోసం నరేష్ ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారు. పైకి ఎన్ని చెబుతున్నా ఇది ఆయన నాలుగో మ్యారేజ్ బయోపిక్ అని అందరికీ అర్ధమవుతూనే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పవిత్ర లోకేష్ తో పబ్లిక్ గా నరేష్ చేసిన సాంగ్ రొమాన్స్ నెక్స్ట్ లెవెలని చెప్పొచ్చు. మాములుగా వయసులో ఉన్న హీరో హీరోయిన్లే ఇలా స్టేజి మీద కెమిస్ట్రీని చూపించుకోరు. ఎంత ఉన్నా అది కేవలం స్క్రీన్ కే పరిమితం. కానీ ఈ జంట మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇందులోనూ స్పెషలని ఋజువు చేసుకున్నారు. వేడుక గ్రాండ్ గానే చేశారు.
ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తన మాటల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ తనను అంగీకరించారని చెప్పిన మాట విని అందరూ షాక్ అయ్యారు. నిజానికి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ అభిమానులందరూ నరేష్ కు మద్దతుదారులు కాదు. ఆ మాటకొస్తే వాళ్ళు సుధీర్ బాబునే సీరియస్ గా తీసుకోవడం లేదు. వాళ్ళ లెక్కలో కృష్ణగారి తర్వాత మహేష్ అంతే. ఆ తర్వాత గౌతమ్ వస్తాడు. అలాంటప్పుడు నరేష్ మీద ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపించే అవకాశం లేనప్పుడు ఇక పవిత్రని యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు.
కానీ ఇలా మాటల గేలం వల్ల మళ్ళీ పెళ్లి సినిమాకే ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే ఫస్ట్ డే ఎక్కువైనా తక్కువైనా ఆ క్రెడిట్ మొత్తం నరేష్ పవిత్రలకే చెందుతుంది తప్ప ఇంకొకరికి కాదు. అలాంటప్పుడు ఇంటర్వ్యూలలో కృష్ణ విజయనిర్మల గారి పేర్లను అదే పనిగా ప్రస్తావించడం వర్కౌట్ అయ్యేది కాదు. ఆ మాటకొస్తే మహేష్ ఏ సందర్భంలోనూ నరేష్ పవిత్రలతో క్లోజ్ గా మాట్లాడుతున్న ఫోటోలు కానీ వీడియోల కానీ మచ్చుకు కూడా కనిపించవు. మొత్తానికి ఇంకో అయిదు రోజులు నరేష్ కపుల్ ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండటం ఖాయం.
This post was last modified on May 22, 2023 12:14 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…