విలన్లుగా భయపెట్టిన వాళ్లు తర్వాతి రోజుల్లో కమెడియన్లుగా అలరించిన సందర్భాలున్నాయి. కానీ కామెడీతో నవ్వించిన వాళ్లు విలన్లుగా మారడం అరుదు. అలా మారినా ప్రేక్షకుల ఆమోదం పొందడం కష్టమే. కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన సునీల్ కొన్ని విజయాలందుకున్నాడు కానీ.. ఆ తర్వాత అతడికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మళ్లీ కామెడీ రోల్స్ చేస్తే అవేవీ సరిగా పండలేదు.
దీంతో రూటు మార్చి విలనీ మీద దృష్టిసారించాడతను. రవితేజ హీరోగా నటించిన ‘డిస్కో రాజా’లో అతను విలన్ పాత్రతో పెద్ద షాకిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర విలన్ అని చివర్లో తెలుస్తుంది. ఐతే ఆ ట్విస్టు చూసి షాకవ్వడం పోయి జనాలు నవ్వుకున్నారు.
సునీల్‌ను విలన్ పాత్రలో అస్సలు ఊహించుకోలేకపోయారు జనాలు. ఆ పాత్రను సినిమాలో ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఏమీ బాగా లేకపోయింది. అలా అని సునీల్ ఏమీ తన ప్రయత్నం ఆపేయలేదు. మళ్లీ విలన్‌గా ట్రై చేశాడు. కానీ ఈసారి మాత్రం అది వర్కవుటయ్యేలాగే కనిపిస్తోంది.
తాజాగా రిలీజైన ‘కలర్ ఫొటో’ టీజర్లో సునీల్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. నెగెటివ్ రోల్‌లో మంచి ఇంపాక్టే చూపించాడు. అతడి లుక్స్, డైలాగ్ అన్నీ బాగానే కుదిరాయి. సినిమాలో ఈ పాత్ర ఏ మేర పండుతుందన్నది పక్కన పెడితే.. ముందు సునీల్‌ను విలన్‌గా యాక్సెప్ట్ చేసేలా ప్రేక్షకులకు ఒక ఫీలింగ్ తీసుకురావడంలో టీజర్ విజయవంతమైంది. సినిమాలో సునీల్ క్యారెక్టర్ అంచనాలకు తగ్గట్లుంటే.. అతను ఇకపై నెగెటివ్ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోవచ్చేమో.
This post was last modified on August 7, 2020 4:31 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…