Movie News

విజయ్ రెమ్యునరేషన్ వార్తలు నిజమేనా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు లియో తర్వాత చేయబోయే సినిమాకు ఏకంగా రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త చెన్నై మీడియాలో వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ సర్కిల్స్ ని సైతం ఈ న్యూస్ కుదిపేస్తోంది. ఇటీవలే కస్టడీ రూపంలో నాగ చైతన్యకి ఒక సూపర్ డిజాస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమవ్వలేదు. అది కాగానే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు

ఇదంతా బాగానే ఉంది కానీ నిజంగా విజయ్ కు అంత మొత్తం ఆఫర్ చేశారనే దాని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో విజయ్ అందరిని మించిన స్టార్ అని ప్రొజెక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అజిత్ ఫ్యాన్స్ తో విజయ్ అభిమానులు గొడవపడిన దాఖలాలు కోకొల్లలు. ముఖ్యంగా తిరుగులేని సూపర్ స్టార్ గా నెంబర్ వన్ సింహాసనం మీద దశాబ్దాల తరబడి కూర్చున్న రజనీకాంత్ కన్నా విజయ్ మార్కెట్ పెద్దదనే మాట గత కొన్నేళ్లుగా బాగా వినిపిస్తోంది. నిజంగానే కొన్ని భారీ వసూళ్లు తెచ్చిన మాట వాస్తవమే. ఇక్కడో ట్విస్టు ఉంది

మాస్టర్ టైంలో 80 కోట్లు తీసుకున్న విజయ్ కేవలం ఇంత తక్కువ టైంలో డబుల్ కన్నా ఎక్కువ ఎలా రీచ్ అవుతారనేది ఒక ప్రశ్న. పోనీ పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాగా ఇండియా, ప్రపంచం మెచ్చుకున్న యునానిమస్ బ్లాక్ బస్టర్స్ ఏవైనా చేశాడా అంటే అదీ లేదు. తేరి నుంచి వారసుడు దాకా అన్నీ రెగ్యులర్ రొటీన్ ఎంటర్ టైనర్లు. వంద నుంచి రెండు వందల కోట్ల మధ్యలో వసూలు చేశాయి. అంత మాత్రాన ఇలా డబుల్ సెంచరీ పారితోషికం ప్రచారం ఏమిటనేది అంతుచిక్కని సస్పెన్స్. నిజమైనా కాకపోయినా ఇవన్నీ అధికారికంగా చెప్పరు కాబట్టి ఇది అంతుతేలని మిస్టరీనే

This post was last modified on May 21, 2023 12:44 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago