ఏడేళ్ల కిందట ‘బిచ్చగాడు’ అనే చిన్న అనువాద చిత్రం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అసలీ టైటిల్ చూసి.. ఇదేం సినిమారా బాబూ అన్నవాళ్లు కూడా.. ఆ చిత్రాన్ని చూసి అబ్బురపడ్డారు. పెద్దగా పబ్లిసిటీ ఏమీ లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తో ఆ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. తెలుగులో ఏకంగా రూ.30 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ టైంలో కొన్ని వారాల పాటు ఏ కొత్త సినిమా రిలీజై సరైన వసూళ్లు రాబట్టలేకపోతున్నా.. దాన్ని ‘బిచ్చగాడు’తో రీప్లేస్ చేసే పరిస్థితి వచ్చింది. చివరికి మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ సైతం ‘బిచ్చగాడు’ దెబ్బకు విలవిలలాడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఒక్క సినిమాతో వచ్చిన పేరు, మార్కెట్‌తో విజయ్ ఆంటోనీ ఆ తర్వాత వరుసగా తెలుగులో మంచి క్రేజ్ మధ్య తన సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చాడు. కానీ అతడి తర్వాతి సినిమాలు ఏవీ అంచనాలను అందుకోలేకపోయాయి. వరుస ఫెయిల్యూర్ల కారణంగా ఒక దశ తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలను పట్టించుకోవడమే మానేశారు తెలుగు ప్రేక్షకులు. కొన్నేళ్లుగా అతడి సినిమాలు తెలుగులో డబ్ కూడా కావట్లేదు.
ఈ పరిస్థితుల్లో ‘బిచ్చగాడు-2’ అంటూ వచ్చాడు విజయ్ ఆంటోనీ. ఐతే తన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. పైగా ‘బిచ్చగాడు-2’ ట్రైలర్ ఆకట్టుకోలేదు. ‘బిచ్చగాడు’ను డైరెక్ట్ చేసిన శశి ఈ సినిమాకు దూరమయ్యాడు. స్వయంగా విజయే డైరెక్ట్ చేశాడు. దీంతో ఈ సినిమా ఏమేర ఆకట్టుకుంటుందో అనుకున్నారు. దీనికి తోడు సినిమాకు మంచి టాక్ కూడా రాలేదు. కానీ ‘బిచ్చగాడు-2’ వసూళ్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తొలి రోజు రూ.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. మార్నింగ్ షోలతో పోలిస్తే తొలి రోజు మధ్యాహ్నం షోలకు వసూళ్లు పెరిగాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
శనివారం కూడా ఆక్యుపెన్సీలు, వసూళ్లు అంచనాలకు మించే ఉన్నాయి. వీకెండ్ అయ్యేలోపు ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేలా ఉంది. రిలీజ్ టైంకి అన్నీ ప్రతికూలతలే కనిపించినా.. ‘ఈ సినిమాకు మాస్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. దీన్ని బట్టే ‘బిచ్చగాడు’ బ్రాండ్ ఎంత స్ట్రాంగో అర్థమవుతోంది. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి.
This post was last modified on May 21, 2023 10:50 am
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…