నట వారసత్వం ఎందరికో దక్కుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడమనే సవాల్ ని అందరూ గెలవలేరు. విజేతలు కాలేరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టేనాటికి జూనియర్ ది ఇరవై కూడా దాటని వయసు. గుణశేఖర్ తీసిన రామాయణంతో గుర్తింపు తెచ్చుకున్నా, రామోజీరావు లాంటి అగ్ర నిర్మాత ద్వారా నిన్ను చూడాలనితో పరిచయమైనా తర్వాత నల్లేరు మీద నడక జరగలేదు. ఎత్తుపల్లాలు వచ్చాయి. స్టూడెంట్ నెంబర్ 1 హీరోని చేస్తే ఆది ఒక్క రాత్రిలో స్టార్ డం తీసుకొచ్చింది. అభిమానుల్లో పెరిగిన విపరీతమైన అంచనాలు అల్లరి రాముడు, నాగలను ఆడనివ్వలేదు. రాజమౌళితో స్నేహం సింహాద్రిని ఇచ్చింది.
అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన కుర్రతనం కళ్లెం లేని గుర్రంలా పరిగెత్తింది. దీంతో ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు లాంటి డిజాస్టర్ బ్రేకులు. ఎక్కడో లెక్క తప్పుతోంది. సరిచేసుకోవడానికి ఎదురు చూస్తున టైంలో కృష్ణవంశీ రాఖీ యంగ్ టైగర్ నటనలో బలమేంటో చూపించింది. కానీ సరిపోలేదు. సగటు తెలుగు మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలు విజయాలు ఎన్ని సాధించినా శరీరం పట్ల చూపించాల్సిన శ్రద్ధ మిస్ అవుతుందని గుర్తించి దాన్ని సరిచేసుకున్న తీరు యమదొంగలో నమ్మశక్యం కానీ రూపాన్ని తీసుకొచ్చింది. అదుర్స్, బృందావనం విజయాలు ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ ని మరింత దగ్గర చేశాయి.
రామయ్య వస్తావయ్యా, శక్తి, రభస లాంటి గాయాలు ఇకపై అడుగులు ఎలా వేయకూడదో పాఠాలు నేర్పించాయి. వాటి ఫలితమే టెంపర్ లో దయాగా విశ్వరూపం, జై లవకుశలో అద్భుతంగా పండిన త్రిపాత్రాభినయం. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కు సూచికగా నిలిచిన అరవింద సమేత వీర రాఘవ మరో మేలిమలుపు. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీంగా చూపిన నటన సాధారణ ప్రేక్షకులనూ కదిలించింది. ఇటు బుల్లితెరపై వ్యాఖ్యాతగా బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు ప్రతిభ చూపడం బహుముఖప్రజ్ఞకు నిదర్శనం. గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాక జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత పెరిగింది. దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ఇలా లైనప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న తారక్ వయసు పరంగా పూర్తి చేసుకుంది నలభై వసంతాలే కావొచ్చు. కానీ అందుకోవాల్సిన మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి.
This post was last modified on May 20, 2023 2:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…