ఎన్టీఆర్ కొత్త సినిమాకు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న టైటిలే ఖాయమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘దేవర’ అనే పేరునే ప్రకటించారు. ఈ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా అదిరింది అనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. కాకపోతే ఈ టైటిల్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అంత సంతృప్తిగా లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ‘దేవర’ అనే పేరు విషయంలో వాళ్లు కొంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయి ఉన్నారు.
వాళ్లకు అలాంటి కనెక్షన్ ఏర్పడేలా చేసింది పవన్ వీరాభిమానుల్లో ఒకరైన నిర్మాత బండ్ల గణేషే. ఎన్నో ఏళ్ల నుంచి పవన్‌ను అతను దేవర దేవర అని సంబోధిస్తూ వస్తున్నాడు. ఈ టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా తీయాలని కూడా బండ్ల అనుకున్నాడు. ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడు కానీ.. రెన్యువల్ చేయించడం మరిచిపోయాడు. ఈలోపు కొరటాల తన సినిమాకు ఈ టైటిల్ అనుకోవడం.. రిజిస్టర్ చేయించడం.. ఇప్పుడు అదే పేరునే ప్రకటించడం జరిగిపోయాయి.
‘దేవర’ టైటిల్‌ను తారక్ సినిమాకు ప్రకటించడంపై బండ్ల గణేష్ కొంత అసహనంతోనే ట్వీట్ వేశాడు. ‘‘దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు’’ అని యాంగ్రీ ఎమోజీ జోడించి ట్వీట్ వేశాడు బండ్ల. ఐతే ఈలోపు ఎన్టీఆర్ అభిమానులు టార్గెట్ చేయడం వల్లో ఏమో.. దీనిపై క్లారిటీ ఇస్తూ ఇంకో ట్వీట్ వేశాడు. “నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే” అంటూ లవ్ ఎమోజీ జోడించాడు.
ఎన్టీఆర్‌తో బండ్ల గణేష్ ‘బాద్‌షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య మంచి అనుబంధమే ఉండేది. ఇక కొరటాల దర్శకత్వంలోనూ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టి ఆపేశాడు. మరి ఈ విషయంలో కొరటాల మీద అసహనంతో ట్వీట్ వేసి.. తర్వాత సర్దుకున్నట్లు కనిపిస్తోంది. కొన్నేళ్ల కిందటే సినిమా నిర్మాణం ఆపేసిన బండ్ల.. తిరిగి ఓ భారీ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ.. పెద్ద హీరోలెవరూ అతడికి డేట్లు ఇచ్చే సంకేతాలు కనిపించడం లేదు.
This post was last modified on May 20, 2023 9:56 am
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…
``తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు…
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ,…
అసలు సాధ్యమే కాదని భావించింది నిజమయ్యింది. రాజమౌళి రికార్డులు మళ్ళీ ఆయనే తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరనే వాదన బద్దలయ్యింది.…
తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన…