ఈ సోషల్ మీడియా కాలంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడు సినీ జనాలు జాగ్రత్తగా.. ఆచితూచి మాట్లాడాల్సిందే. చిన్న మాట తూలినా దాన్ని వలువలు చిలువలు చేసేస్తారు సోషల్ మీడియా జనాలు. కొన్నిసార్లు సెలబ్రెటీలే తప్పు మాట్లాడి నాలుక్కరుచుకుంటే.. కొన్ని సందర్భాల్లో వారి మాటల్లో తప్పేమీ లేకున్నా.. భూతద్దం పెట్టి చూసే జనాలు వివాదాస్పదంగా మారుస్తుంటారు.
ఇటీవల తెలుగు అమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్.. ‘పుష్ఫ’లో శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటవుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం.. తానైతే శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే బాగా చేసేదాన్నని ఐశ్వర్య వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ హర్టయి ఐశ్వర్యను టార్గెట్ చేశారు. చాలా సున్నితంగా కనిపిస్తూ, అంతే సున్నితంగా మాట్లాడే ఐశ్వర్య.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఆలస్యం చేయకుండా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసింది.
రష్మికను తక్కువ చేసేలా తానేం మాట్లాడలేదని.. ఆమె పట్ల తనకెంతో గౌరవం ఉందని.. తనకు శ్రీవల్లి పాత్ర నచ్చిందని, తనకా పాత్ర బాగా సూటవుతుందని మాత్రమే అన్నానని ఆమె ఈ నోట్‌లో పేర్కొంది. ఈ వివాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక.. ఆ నోట్ మీద ట్విట్టర్లో స్పందించింది. ‘‘హాయ్ లవ్.. ఇది నేను ఇప్పుడే చూశా. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మన గురించి మనం ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.
నాకు నీ పట్ల ప్రేమ, గౌరవ భావాలు మాత్రమే ఉన్నాయి. నీ కొత్త సినిమా ఫర్హానాకు నా శుభాభినందనలు’’ అని హుందాగా మాట్లాడింది రష్మిక. తన వ్యాఖ్యలపై ఐశ్వర్య వివరణ ఇచ్చిన తీరు.. దానికి రష్మిక స్పందించిన వైనం రెండూ కూడా హుందాగానే ఉండటంతో వాళ్లిద్దరినీ నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప-2’తో పాటు తెలుగులో మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఐశ్వర్య తమిళంలో మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
This post was last modified on May 19, 2023 3:49 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…